Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

ABN, Publish Date - Sep 29 , 2025 | 07:35 AM

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో హైడ్రా పునరుద్ధరించిన ‘బతుకమ్మ కుంట’ను ఆదివారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మ కుంటను ప్రారంభించడంతోపాటు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 1/16

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో హైడ్రా పునరుద్ధరించిన ‘బతుకమ్మ కుంట’ను ఆదివారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అంకితం చేశారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 2/16

బతుకమ్మ కుంటను ప్రారంభించడంతో పాటు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 3/16

బతుకమ్మ కుంట ప్రారంబోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఛే నెంబర్‌ చౌరస్తా వద్ద వందలాది మంది మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 4/16

అక్కడి నుంచి బతుకమ్మ కుంట వరకు సీఎం కాలినడకన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 5/16

రాత్రి 7.30 గంటల సమయంలో బతుకమ్మ కుంటను ప్రారంభించారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 6/16

ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వామ్యం చేస్తేనే దసరా, బతుకమ్మ పండుగలకు నిండుదనం ఉంటుందని ఉద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 7/16

బతుకమ్మ కుంటకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేరు పెట్టాలన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ సూచన మేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 8/16

హైడ్రా కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన పాటను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 9/16

అంబర్‌పేటలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా మినీ సెక్రటేరియట్‌ లాంటి భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 10/16

బతుకమ్మ కుంట జలకళతో జీవకళను అలుముకుందని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 11/16

నిన్నటి వరకు కబ్జాకోరల్లో చిక్కి, కుంచించుకుపోయి, తన అస్థిత్వమే ప్రశ్నార్ధకమైన అంబర్‌పేట బతుకమ్మ కుంట మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 12/16

తన అలలపై ఆడబిడ్డల బతుకమ్మల ఒయలు ప్రదర్శిస్తూ గత వైభవాన్ని తిరిగి సాధించుకుందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 13/16

హైదరాబాద్ మహానగరంలో కబ్జా కోరల్లో చిక్కి అస్థిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న ప్రతి చెరువును తిరిగి పునరుద్ధరిస్తామని ఉద్ఘాటించారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 14/16

లేక్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతామని నొక్కిచెప్పారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 15/16

తమ ఆలోచనకు ఈ రోజు ప్రారంభించుకున్న బతుకమ్మకుంట తొలి అడుగని చెప్పుకొచ్చారు.

Bathukamma Kunta: అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం 16/16

ఈ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో మహిళలను భాగస్వామ్యం చేయడం సంతోషం కలిగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

Updated at - Sep 29 , 2025 | 07:49 AM