Amit Shah: ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
ABN, Publish Date - Jan 19 , 2025 | 07:27 AM
ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజులపాటు పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం రాత్రి 08:30 గంటలకు అమిత్ షా చేరుకున్నారు. రెండు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు అమిత్ షా బిజీ బిజీగా ఉండనున్నారు.

ఏపీకి వచ్చిన అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో కేంద్ర హోంమంత్రికి స్వాగతం పలికేందుకు మూడు పార్టీల నుంచి 13 మంది నేతలు విమానాశ్రయానికి వచ్చారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ నుంచి మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, తదితర నేతలు అమిత్ షాకు స్వాగతం పలికారు.

అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో కూటమి నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉండవల్లి వరకూ అమిత్ షాకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.

అమిత్‌షా పర్యటనలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,200 మంది పోలీసులు ఆయన రక్షణలో ఉన్నారు.

కొండపావులూరులోని ఎన్‌ఐడీఎం, ఎన్డీఆర్‌ఎఫ్ సంస్థలను ఆదివారం అమిత్ షా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సభావేదికను సిద్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే అమరావతికి అమిత్ షా రావడంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో కూటమి నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉండవల్లి వరకూ అమిత్ షాకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లారు. అయితే మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని చిన్ని, ఎన్డీఏ నేతలు, అధికారులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
Updated at - Jan 19 , 2025 | 07:39 AM