జగన్ పాలనపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ABN, Publish Date - Jan 29 , 2025 | 08:02 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ హయాంలో నష్టపోయిన బాధితులు అమరావతిలోని టీడీపీ గ్రీవెన్స్ సెల్లో తమ బాధలు చెప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకొని ఆయా జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

అధికారం అడ్డం పెట్టుకొని జగన్ చేసిన అక్రమాలకు ప్రజలు బలయ్యారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.
Updated at - Jan 29 , 2025 | 08:03 PM