శ్రీకాకుళం జిల్లాలో సూర్య నమస్కారాలు..!
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:51 PM
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ,సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది.

ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ,సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది.

80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో సూర్య నమస్కారాలు జరిగాయి.

జిల్లా యోగా గురువు రామారావు. 12 రకాల ఆసనాలు వివరిస్తూ.. అందరితో చేయించారు.

అనంతరం గురువు మాట్లాడుతూ సూర్య నమస్కారాలు కేవలం భౌతిక సాధన కాదు మనస్సు, శరీర అవగాహనను కూడా పెంపొందించుకోడానికి దోహదపడతాయన్నారు.

సూర్య నమస్కారాలు ఉదయం ఖాళీ కడుపుతో చేయడం మంచిదన్నారు.
Updated at - Feb 02 , 2025 | 01:53 PM