WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి ..

ABN, Publish Date - Jan 30 , 2025 | 09:56 PM

‘మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం’’ వాట్సాప్ గవర్నెన్స్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం నాడు ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధ్రువపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటుంది.

WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి .. 1/5

వాట్సాప్ సేవల కోసం నెంబర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను వినియోగించుకోవాలని ప్రకటించింది.

WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి .. 2/5

దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి .. 3/5

మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా ఏపీ ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి .. 4/5

వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవల కోసం ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.

WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి .. 5/5

వాట్సాప్‌ గవర్నెన్స్‌తో సులభంగా సమస్యల పరిష్కారం చేసుకోవచ్చని, యువగళం పాదయాత్రలోనే వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన చేసినట్లు మంత్రి లోకేష్‌ తెలిపారు.

Updated at - Jan 30 , 2025 | 09:56 PM