ABN AndhraJyothy: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ABN, Publish Date - Jul 11 , 2025 | 07:45 AM
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ మూకలు విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, కూటమి నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శివకుమార్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జులై 10వ తేదీన తిరుపతి ప్రెస్‌క్లబ్ వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.
1/10
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ మూకలు విచక్షణ రహితంగా దాడి చేశాయి.
2/10
ఈ దాడిలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
3/10
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, కూటమి నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
4/10
శివకుమార్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జులై 10వ తేదీన తిరుపతి ప్రెస్‌క్లబ్ వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
5/10
ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
6/10
దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
7/10
సుమారు పదిమంది వైసీపీ నేతలు చుట్టు ముట్టి, శివకుమార్ చొక్కా చించేసి మరీ విచక్షణ రహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్ట్ సంఘాల నేతలు.
8/10
జగన్ పర్యటనలో శివకుమార్ తీసిన ఫొటోలు ఉండే మెమరీ కార్డు లాక్కోని దాడి చేశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు జర్నలిస్ట్ సంఘాల నేతలు.
9/10
మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగా చేయడంతోనే వైసీపీ మూకలు శివకుమార్‌పై దాడికి తెగబడ్డారని జర్నలిస్ట్ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
10/10
చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగిందని, శివకుమార్ మెమరీ కార్డును.. విజయానంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారని జర్నలిస్ట్ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - Jul 11 , 2025 | 07:56 AM