Graduation Ceremony: అనంతపురంలో ఘనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవం
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:06 PM
అనంతపురంలోని శారద నగర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (గ్రాడ్యుయేషన్ సెర్మని) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

అనంతపురంలోని శారద నగర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (గ్రాడ్యుయేషన్ సెర్మని) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్. వి.వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థుల ప్రయాణం ఇప్పుడే మొదలైందని, వైద్య విద్య పూర్తి చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు గర్వపడుతున్నారని అన్నారు.

ఈరోజు విద్యార్థులు మెటల్ మెడల్‌ను తీసుకుంటున్నారని, అయితే రేపు డాక్టర్‌గా రోగికి చికిత్స అందించడం ఒక మెడల్‌తో సమానం అని తెలిపారు.

కార్యక్రమంలో సెల్పీలు దిగుతున్న విద్యార్థులు

పట్టా తీసుకున్న అనంతరం ప్రమాణం చేస్తున్న విద్యార్థులు

విద్యార్థులకు మెమెంటోలు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్, తదితరులు అందజేశారు.

అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.మాణిక్యరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ శంషాద్ బేగం, షారన్ సోనియా, డా.మధుసూదన్, డిప్యూటీ సూపరింటెండెంట్ బెనెడిక్ట్ కోయిలో, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Updated at - Mar 06 , 2025 | 12:09 PM