Chandrababu Srisailam: శ్రీశైలంలో సీఎం చంద్రబాబు.. భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:49 PM
Chandrababu Naidu Srisailam Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
1/6
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైల పర్యటనలో ఉన్నారు.
2/6
ఈ సందర్భంగా శ్రీశైల మల్లన్నను, భ్రమరాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
3/6
ఆయనకు ఆలయ అధికారులు, పండితులు ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.
4/6
జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఆయన శ్రీశైలం విచ్చేశారు.
5/6
అంతకుముందు సున్నిపెంట హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, అధికారులు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
6/6
మల్లన్న సేవ అనంతరం సీఎం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు.
Updated at - Jul 08 , 2025 | 05:03 PM