CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Mar 11 , 2025 | 07:03 AM

విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్’ గ్రంథావిష్కరణ జరిగింది. ఎమ్మెస్కో ముద్రించిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 1/15

విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్’ గ్రంథావిష్కరణ జరిగింది.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 2/15

ఎమ్మెస్కో ముద్రించిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 3/15

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 4/15

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 5/15

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, మండలి బుద్ద ప్రసాద్, ఎమ్మెస్కో విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 6/15

డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్’ ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 7/15

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 8/15

సీఎం చంద్రబాబుకు పుస్తక వివరాలు తెలియజేస్తున్న నోరిదత్తాత్రేయుడు

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 9/15

తన ఆటో బయోగ్రఫీ ఈరోజు ఇలా ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందని నోరిదత్తాత్రేయుడు ఉద్ఘాటించారు. ఇది తన జీవితంలో మరచిపోలేని ఒక గొప్ప సంఘటన అని అభివర్ణించారు.తన జీవితం కృష్ణాజిల్లా మంటాడ నుంచి ప్రారంభమైందని నోరిదత్తాత్రేయుడు గుర్తుచేసుకున్నారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 10/15

నోరి దత్తాత్రేయ జీవితం వడ్డించిన విస్తరి కాదని సీఎం చంద్రబాబు తెలిపారు. మారుమూల ఉన్న మంటాడలో పుట్టి.. తన సేవలతో ప్రపంచాన్నే మెప్పించారని కొనియాడారు. తెలుగువాళ్లుగా మనమంతా ఇందుకు గర్వించాలని ఉద్ఘాటించారు. ఒక సంకల్పంతో.. అచంచలమైన విశ్వాసంతో నోరి దత్తాత్రేయ ముందుకు సాగుతారని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 11/15

మహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తమ వైద్యులుగా నోరిదత్తాత్రేయకు అవార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య వృత్తిలో ఆయన సేవలను అందించడమే కాదు, యాభై ఏళ్లల్లో ఎంతోమందికి ప్రాణం పోశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 12/15

నోరి దత్తాత్రేయ తన ఆత్మకథను ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్’ పేరుతో పుస్తకం రాయడం విశేషమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఎంతోమందికి నోరి దత్తాత్రేయ జీవితం ఆదర్శప్రాయమని ప్రశంసలు కురిపించారు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు..ఎన్నో ఇబ్బందులతో ఈ స్థాయికు ఎదిగారని మండలి బుద్ద ప్రసాద్ కొనియాడారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 13/15

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 14/15

నోరి దత్తాత్రేయకు ప్రతి నిమిషం విలువైనదే.. అయినా.. అవగాహన సదస్సులో పాల్గొంటూ.. ప్రజలను చైతన్య పరుస్తున్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. తాను పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపన నోరి దత్తాత్రేయలో ఉందని ఉద్ఘాటించారు. తన తల్లి, సోదరి కూడా కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారని మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu: విజయవాడలో నోరి దత్తాత్రేయుడు గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు 15/15

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బుక్‌ను తీసుకుంటున్న దృశ్యం

Updated at - Mar 11 , 2025 | 01:15 PM