CM Chandrababu: కడప విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
ABN, Publish Date - Feb 01 , 2025 | 03:10 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు అన్నమయ్యజిల్లాలో పర్యటించారు. అన్నమయ్య జిల్లాకు వెళ్లేందుకు కడప విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అన్నమయ్యజిల్లాకు వెళ్లారు.

కడప విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు అధికారులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

కడప నుంచి హెలికాప్టర్లో అన్నమయ్యజిల్లా సంబేపల్లికి సీఎం చంద్రబాబు బయలుదేరారు.

సీఎం చంద్రబాబును కలిసి పోలీసు అధికారులు పూల బొకే అందజేశారు.

అన్నమయ్య జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.

పలు అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Updated at - Feb 01 , 2025 | 03:11 PM