CM Chandrababu: సురవరం మృతి దేశానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Aug 24 , 2025 | 04:10 PM
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురవరం సేవలను సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
1/6
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.
2/6
హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.
3/6
సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురవరం సేవలను సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
4/6
సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు.
5/6
ఆయనకు తానంటే ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టిన పనులను అభినందించి, ప్రోత్సహించేవారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
6/6
సురవరంతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆయన మృతి సీపీఐకి, దేశానికి తీరని లోటని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.
Updated at - Aug 24 , 2025 | 04:13 PM