Share News

Indian Techie Killed: భారత సంతతికి చెందిన టెక్కీ హత్య..అసలేమైంది, ఎందుకు జరిగిందంటే

ABN , Publish Date - May 21 , 2025 | 08:51 AM

అమెరికా టెక్సాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మామపై కోపంతో ఓ వ్యక్తి మరొకరిపై దాడికి పాల్పడ్డాడు. ఏకంగా కత్తితో దాడి చేసి కోపాన్ని తీర్చుకున్నాడు.

Indian Techie Killed: భారత సంతతికి చెందిన టెక్కీ హత్య..అసలేమైంది, ఎందుకు జరిగిందంటే
Akshay Gupta murder Texas

అగ్రరాజ్యం అమెరికా(America)లో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన యువ వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా(30)ను (Indian Techie Killed) మరో తోటి భారతీయుడు హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మే 14న చోటుచేసుకుంది. దీపక్ ఖండేల్వాల్ అనే వ్యక్తి, అక్షయ్ గుప్తాను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలోనే కత్తితో పొడిచి చంపాడు. సీసీ ఫుటేజీ ప్రకారం చూస్తే అక్షయ్ గుప్తా బస్సులో వెనుక సీట్లో కూర్చుని ఉండగా, ఖండేల్వాల్ అతని వద్దకు ఆవేశంతో వెళ్లి కత్తితో ఎటాక్ చేశాడు. ఆ తర్వాత బస్సు ఆగిన వెంటనే ఏమి తెలియనట్లుగా బయటకు దిగిపోయి ఇతర ప్రయాణికులతో కలిసి వెళ్లాడు.


మామపై కోపంతో..

అప్రమత్తమైన అక్కడి సిబ్బంది వెంటనే గుప్తాను ప్రాణాలతో బతికించాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందారు. రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు 31 ఏళ్ల దీపక్ ఖండేల్వాల్‎ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో దీపక్ ఖండేలాల్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ క్రమంలో గుప్తా తన మామలా కనిపించడం వల్లే ఇలా చేశానని అతను చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో పలు సందర్భాల్లో మనుషులు వారి మనసులోని చెడు భావాలను, కోపాన్ని లేదా ఒత్తిడిని ఎదుర్కొంటూ వారిని వారు కంట్రోల్ చేసుకోలేక పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. నిందితుడు హత్య చేసి తన మామ మాదిరిగా కనిపించాడని చెప్పాడంటే, మామపై అతనికి ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో బస్సు ఎక్కిన సమయంలో దీపక్ ఖండేల్వాల్ మామపై కోపాన్ని అక్షయ్ గుప్తాపై చూపించినట్లు తెలుస్తోంది.


గుప్తా మాత్రం

మరోవైపు అక్షయ్ గుప్తా మాత్రం మంచి యువ వ్యాపారవేత్త. చిన్న వయస్సులోనే సాంకేతిక రంగంలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. ఆయన "ఫూట్‌బిట్" అనే ఆరోగ్య టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇది వృద్ధుల సహాయం కోసం ఏర్పాటు చేశారు. ఆయన గతంలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా నుంచీ పిలుపు అందుకున్నారు. దీంతోపాటు గుప్తా అమెరికాలోని అమెజాన్ నుంచి $300,000 ఆఫర్‌ను తిరస్కరించి, తన స్టార్టప్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా హత్యకు గురికావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.


ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 10:20 AM