Karnataka: బెయిల్ వచ్చిందని ర్యాలీ చేశారు.. రేప్ కేసు నిందితులపై ప్రజల ఆగ్రహం..
ABN , Publish Date - May 23 , 2025 | 12:52 PM
రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న యువకులకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదల అవగానే వారంతా బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న యువకులకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదల కాగానే ఆ యువకులంతా బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈలలు, కేకలు వేస్తూ గోల గోల చేశారు. వీరి నిర్వాకంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కర్నాటక (Karnataka) హవేరి జిల్లా అక్కి ఆలూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేప్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అఫ్తాబ్ చందనకట్టి, మదర్ సాబ్ మందక్కి, సమివుల్లా లలనావర్, మొహమ్మద్ సాదిక్ అగసిమణి, షోయిబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సావికేరి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన వారు.. బైకులు, కార్లతో పట్టణంలో ర్యాలీ చేశారు. తామేదో గొప్ప పని చేసి బయటికి వచ్చినట్లుగా విజయం సంకేతాలు చూపుతూ, ఈలలు.. కేకలు వేస్తూ వెళ్లడాన్ని చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
కర్నాటక హవేరి జిల్లాలో 2014 జనవరి 8న మహిళపై గ్యాంప్ రేప్ జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన 26 ఏళ్ల మహిళ.. మరో మతానికి చెందిన 40 ఏళ్ల ఆర్టీసీ డ్రైవర్‌తో కలిసి హోటల్ గదిలో ఉంది. ఈ క్రమంలో పైపు రిపేరు పేరుతో గదిలోకి వచ్చిన ఏడుగురు దుండగులు ఆమెను బలవంతంగా కారులో వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. వేరే మతానికి చెందిన వ్యక్తితో ఉన్నాననే కోపంతోనే ఇలా చేశారని అప్పట్లో బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. కాగా, వీరిలో 7 మంది ప్రధాన నిందితులుగా తేల్చారు. వీరిలో 12 మందిని సుమారు 10 నెలల క్రితం బెయిల్‌పై విడుదల చేయగా.. మిగిలిన ఏడుగురు నిందితులకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, విడుదలైన యువకుల ర్యాలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News