Share News

BJP: యత్నాళ్‌కు అధిష్టానం షాక్‌.. క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:52 PM

బీజేపీలో మరో గుబులు పట్టుకుంది. ఇప్పటివరకు గ్రూపు విభేదాలతో తారస్థాయికి చేరిన వర్గపోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెబెల్‌ నేత బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌(Basanagowda Patil Yatnal)కు అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది.

BJP: యత్నాళ్‌కు అధిష్టానం షాక్‌.. క్రమశిక్షణ కమిటీ నోటీసులు

- 72 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

బెంగళూరు: బీజేపీలో మరో గుబులు పట్టుకుంది. ఇప్పటివరకు గ్రూపు విభేదాలతో తారస్థాయికి చేరిన వర్గపోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెబెల్‌ నేత బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌(Basanagowda Patil Yatnal)కు అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణా కమిటీ ద్వారా జారీ చేసిన నోటీసులలో 72 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ కార్యదర్శి ఓంపాఠక్‌ సోమవారం నోటీసులు జారీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Tungabhadra: తుంగభద్ర నుంచి అదనపు జలాల విడుదల


pandu2.jpg

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yediyurappa)లతోపాటు వారి ఆప్తులకు వ్యతిరేకంగా మారిన యత్నాళ్‌కు ఇచ్చిన నోటీసులకు ఎలాంటి వివరణ ఇస్తారనేది వేచి చూడాలి. యత్నాళ్‌తోపాటు రెబెల్‌ కూటమి సభ్యులంతా ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి సోమణ్ణ భేటీ అయ్యారు. ఈలోగానే నోటీసు రావడంతో ఢిల్లీలోనే ఉండే యత్నాళ్‌ మంగళవారం సాయంత్రం లేదా బుధవారం అధిష్ఠానం ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 12:52 PM