Yadvinder Singh life Story: కష్టాల కడలి దాటి.. పుట్టగొడుగులతో కోటీశ్వరుడైన వ్యక్తి
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:56 PM
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా తల్హేరి గ్రామానికి చెందిన యద్వీందర్ అనే రైతు పుట్టగొడుగుల సాగుతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఆయన ఎనిమిదో తరగతి వరకే చదివి.. ఆర్థిక ఇబ్బందులతో బడి మానేశాడు. స్థానికంగా ఏ పనిలేక పోవడంతో ఆయన కుటుంబంలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కష్టాల కడలిని ఈది.. అతిమంగా విజయం సాధించారు.
మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి సహజం. అయితే కొందరి జీవితంలో మాత్రం ఎక్కువ భాగం కష్టాలు, సమస్యలే ఉంటాయి. అలాంటి వాటిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరు మాత్రం పడి లేచిన కెరటంలా.. తాము అనుకున్న రంగంలో విజయం సాధిస్తారు. అంతేకాక కటిక పేదరికం నుంచి కోటీశ్వర్లుగా మారిన వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారి లైఫ్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శం. అలా సమస్యల కడలిని ఈదుతు జీవితంలో సూపర్ సక్సెస్ అందుకున్న వ్యక్తే యద్వీందర్ సింగ్(Yadvinder Singh Inspirational Stories). ఈయన జీవితం యువతకు స్ఫూర్తి. ఇక ఈ రియల్ హీరో లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా తల్హేరి గ్రామానికి చెందిన యద్వీందర్(Yadvinder Singh) అనే రైతు పుట్టగొడుగుల సాగుతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఆయన ఎనిమిదో తరగతి వరకే చదివి.. ఆర్థిక ఇబ్బందులతో బడి మానేశాడు. స్థానికంగా ఏ పనిలేక పోవడంతో ఆయన కుటుంబంలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో బతుకు దెరువు కోసం డంకీ మార్గంలో సౌత్ కొరియా వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యారు. డంకీ అనగా అక్రమ మార్గంలో ఇతర దేశాలకు వెళ్లడం. ఇక దక్షిణ కొరియా వెళ్లడంలో విఫలం కావడంతో స్థానికంగానే చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత స్థానికంగా పుట్టగొడుగులు సాగుచేసే(Farming innovation) ఓ రైతు వద్ద పనిలో చేరారు. యద్వీందర్ సింగ్ నెలకు జీతం రూ.3,200 పొందేవారు.
ఆ రైతు దగ్గర పుట్టగొడుగుల సాగులో మెలకువలు నేర్చుకొన్నాక సొంతంగా సాగు చేయాలని నిర్ణయానికి వచ్చారు. మూతపడి ఉన్న తన కోళ్లఫామ్‌లో రూ.50 వేల పెట్టుబడితో 2014లో పుట్టగొడుగుల సాగు( Mushroom farming success) ప్రారంభించారు. వీటి కంపోస్టు కోసం మూడు ఎకరాల్లో శాశ్వత ప్లాంటు నిర్మించి, 12 ఎకరాల్లో పుట్టగొడుగులు సాగు చేస్తున్నారు. ఈ పుట్టగొడుగులకు బాగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో యద్వీందర్ సింగ్ నాణ్యమైన, స్వచ్ఛమైన పుట్టగొడులు అందిస్తుండటంతో.. అతడికి భారీగా ఆర్డర్లు(Agribusiness success) వస్తున్నాయి. 11 ఏళ్ల వ్యవధిలో అంచెలంచెలుగా ఎదిగి రూ.7.5 కోట్ల వార్షిక టర్నోవరుకు చేరారు. ప్రస్తుతం యద్వీందర్ 250 మందికి తానే ఉపాధి కల్పిస్తున్నారు. 'అవకాశాలు లేవు, మేము ఏమి చేయలేకపోతున్నాము' అని అనుకుని నిరాశతో జీవితాన్ని గడిపే వారికి యద్వీందర్ సింగ్ జీవితమే స్ఫూర్తి.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..