Fifth Class Girl Attack Case: ఐదవ తరగతి బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ.. హత్యేనని తేల్చిన పోలీసులు
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:53 PM
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన చిన్నారి సూసైడ్ కేసు మిస్టరీ వీడింది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన ఘటనలో బాలిక ఆత్మహత్య చేసుకోలేదని.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ, మెసేజులు, వేలిముద్రల ఆధారంగా నిందితుని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడు సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేసినట్లు వెల్లడించారు.
రామచంద్రాపురం, నవంబర్ 11: కోనసీమ జిల్లా జిల్లా రామచంద్రపురంలో ఐదవ తరగతి బాలిక రంజిత అనుమాస్పద మృతి మిస్టరీ వీడింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాసే నిందితుడని పోలీసులు తేల్చారు. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీనివాసరావు బాలికను హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు.
ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో డోర్ నెమ్మదిగా తీసి చోరీ చేసేందుకు శ్రీనివాస్ వెళ్లినట్లు తెలిపారు. ఇది చూసిన బాలిక.. ఇంట్లోకి ఎందుకు వచ్చావని అతడిని నిలదీసిందని.. తల్లికి విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీ కరించేందుకు నిందితుడు ప్లాన్ చేసినట్లు తెలిపారు. బాలిక మెడకు చున్నీ వేసి ప్యాన్ కు వ్రేలాడదీసి కేసు ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్ళి సీసీటీవీ పుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ ను వాట్సాప్ లో పెట్టి హడావుడి చేశాడని వివరించారు. ఈ మెసేజ్ తోపాటు వేలిముద్రల ఆధారంగా నిందితుడి జాడ కనిపెట్టినట్లు తెలిపారు.
రంజిత తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న వారు.. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్‌కి వేలాడదీశారని ముందుగానే తల్లి సునీత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 'మా అమ్మాయి అంత చిన్నది. సూసైడ్ చేసుకునేంత వయసు లేదు. అంతకుముందే నాతో మాట్లాడింది. ఆ తర్వాత ఇలా ఎలా?” అంటూ గుండెలవిసేలా ఏడ్చారు. రంజిత అనుమానాస్పద మృతిపై స్కూల్ టీచర్లు స్పందించారు. చదువులో రంజిత చురుకుగా ఉండేదని, ప్రతిరోజు మాదిరిగానే ఘటన ముందు రోజుకూడా కూడా క్లాస్‌లో హాజరైందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పోలీసులను గూండాలంటారా?: పట్టాభిరామ్
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టండి: షర్మిల