Swachhandra Corporation Chairman: పోలీసులను గూండాలంటారా?: పట్టాభిరామ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:55 AM
రోడ్లపైకి వచ్చి వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారు. అడ్డుకుంటున్న పోలీసులను ఆ పార్టీ నాయకులు గూండాలు...
హిందూపురం, మడకశిర టౌన్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘రోడ్లపైకి వచ్చి వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారు. అడ్డుకుంటున్న పోలీసులను ఆ పార్టీ నాయకులు గూండాలు, రౌడీలు అనడం సమంజసం కాదు’ అని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో శనివారం ఆయన పర్యటించారు. మోతుకపల్లివద్ద పాత డంపింగ్ యార్డ్, గుడ్డంపల్లివద్ద డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. పాత డంపింగ్ యార్డ్‌ను వెంటనే శుభ్రం చేసి పార్కుగా మార్చాలని, దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని అధికారులకు సూచించారు.