Birds talking to woman: పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:58 PM
మానవులు, పక్షుల మధ్య స్నేహం చాలా పురాతనమైనది. మనుషులకు పక్షులు సహాయపడిన ఎన్నో ఘటనలు గతంలో ఉన్నాయి. సమాచారాన్ని చేరవేయడానికి గతంలో పావురాలను ఉపయోగించుకునేవారు. ఇక, ఇప్పటికీ పక్షులు ఎగరడం, వాటి ధ్వనులు చాలా మందికి ఆహ్లాదం కలిగిస్తాయి.
మానవులు, పక్షుల మధ్య స్నేహం చాలా పురాతనమైనది. మనుషులకు పక్షులు సహాయపడిన ఎన్నో ఘటనలు గతంలో ఉన్నాయి. సమాచారాన్ని చేరవేయడానికి గతంలో పావురాలను ఉపయోగించుకునేవారు. ఇక, ఇప్పటికీ పక్షులు, వాటి ధ్వనులు చాలా మందికి ఆహ్లాదం కలిగిస్తాయి. పక్షుల రక్షణ కోసం కొందరు వ్యక్తులు గూళ్లు నిర్మిస్తారు. ఆహారం, నీరు అందిస్తారు. అయితే పక్షులు మనుషులను అర్థం చేసుకోవడం, వారితో మాట్లాడడం మాత్రం అరుదు అని చెప్పాల్సిందే (human bird friendship).
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో ఓ బెంగాళీ మహిళతో కొన్ని పక్షులు మాట్లాడుతున్నాయి. ఆమె మాట్లాడేది వింటున్నాయి. పిల్లలతో మాట్లాడుతున్నట్టుగా ఆ మహిళ ఆ పక్షులతో మాట్లాడుతోంది. చూస్తుంటే ఆ పక్షులతో ఆ మహిళకు చాలా సాన్నిహిత్యం ఉన్నట్టు కనబడుతోంది. ముఖ్యంగా ఒక పక్షి ఆ మహిళతో సంభాషించడం కనిపిస్తోంది. ఆమెతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (viral friendship story).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రేమ, నమ్మకంతో ప్రకృతిలోని చిన్న జీవుల హృదయాలను కూడా మనం గెలుచుకోగలమని ఇది చూపిస్తోంది' అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఆమె నిజంగా చాలా అదృష్టవంతురాలని మరొకరు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పక్షులతో అంత కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవడం గొప్ప విషయమని మరొకరు కామెంట్ చేశారు (cute bird moments).
ఇవీ చదవండి:
రాబోయే 7 రోజులు ఇలా చేసి చూడండి... మీ లైఫ్ మారిపోతుంది
చుక్కలు చూపిస్తున్న అమెరికా... రూ. కోటి శాలరీ ఉన్న టెకీకి ఊహించని షాక్