Financial Discipline: రాబోయే 7 రోజులు ఇలా చేసి చూడండి... మీ లైఫ్ మారిపోతుంది
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:16 PM
అనిశ్చితి వెంటాడుతున్న వేళ ఆర్థిక క్రమశిక్షణ సాధించేందుకు కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలని కౌశిక్ అనే సీఏ చెప్పారు. ఆయన నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొందరికి చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు దక్కుతుంటే మరికొందరు అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికస్థిరత్వం కోసం క్రమశిక్షణ అలవరుచుకోవాలి. ఇందుకోసం నితిన్ కౌశిక్ అనే సీఏ నెట్టింట షేర్ చేసిన టిప్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆర్థిక అంశాల్లో క్రమశిక్షణ అలవాటు చేసుకునేందుకు ఏడు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసి ఇచ్చారు. వెంటనే దీన్ని అమల్లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం (Financial Discipline CA shares Tips)..
మొదటి రోజున ఆర్థికస్థితిగతులపై అవగాహన లేమిని తొలగించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్స్‌పై దృష్టి పెట్టాలి. బ్యాలెన్స్ ఎంత ఉంది, క్రెడిట్ కార్డు, సాధారణ లోన్లు ఎంత అన్న విషయాల్ని లెక్కేసుకోవాలి.
రెండవ రోజున ఖర్చులన్నీ బెరీజు వేసుకోవాలి. ఈఎమ్ఐలు, చిన్న చిన్న సబ్‌స్క్రిప్షన్ చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రూ.500 వంటి చిన్న ఖర్చులు కూడా ఏడాది తిరిగే సరికి తడిసిమోపెడు అవుతాయని కౌశిక్ హెచ్చరించారు.
మూడవ రోజున వ్యక్తులు తాము ఎలాంటి ఖర్చులు పెడుతున్నదీ బేరీజు వేసుకోవాలి. అవనసర ఖర్చులు ఏవో గుర్తించాలి. ఈ విషయంలో ఎలాంటి భావోద్వేగాలకూ లోనుకాకూడదు.
నాలుగో రోజున పొదుపుపై దృష్టి పెట్టాలి. చిన్న మొత్తాన్నైనా పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. ఎంత మొత్తం పొదుపు చేశామన్న దానికంటే ఎంత క్రమశిక్షణతో పొదుపు చర్యలు చేపడుతున్నామన్నదే ముఖ్యం అని కౌశిక్ తెలిపారు.
ఐదవ రోజున వ్యక్తులు తమకున్న ఆదాయ మార్గాలను సమీక్షించుకోవాలి. కుదిరితే సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించాలి. గిగ్ రంగంలో పార్ట్ టైమ్ జాబ్స్ కోసం ప్రయత్నించాలి.
ఆరవ రోజున మీ జీవనశైలికి తగిన బడ్జెట్ రూపొందించుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డబ్బును పొదుపు చేస్తూనే లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయొచ్చు.
చివరగా 7వ రోజున లక్ష్యాలను మరింత విస్తృత పరచడంపై దృష్టి సారించాలి. ఈ లక్ష్యాలను నెల రోజుల్లోపు చేరుకునేలా ప్రణాళిక వేసుకుని పని ప్రారంభించాలి. ఇలా చేస్తే భవిష్యత్తుపై ఎలాంటి బెంగ ఉండదని కౌశిక్ భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి:
చలానాను తప్పించుకునే ప్రయత్నం.. నెత్తిపై మూకుడు పెట్టుకుని..
తోక చుక్క చుట్టూ మిస్టరీ... ఎలాన్ మస్క్ సంచలన కామెంట్స్