Bengaluru Viral Video: చలానాను తప్పించుకునే ప్రయత్నం.. నెత్తిపై మూకుడు పెట్టుకుని..
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:27 PM
బైక్ వెనుక సీటుపై కూర్చుని ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నెత్తిపై మూకుడు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చలానాను తప్పించుకునేందుకు అతడి పాట్లు చూస్తుంటే నవ్వొస్తోందని అనేక మంది కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు ఉన్నది మన మేలు కోసమే. అయితే, కట్టుతప్పిన వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసులు చలానాలు విధిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే పక్క వారిని కూడా ప్రమాదంలోకి నెట్టినట్టు అవుతుంది. కానీ కొందరు నిర్లక్ష్యంతో, మరికొందరు పొరపాటున నిబంధనలను అతిక్రమిస్తుంటారు. ఆ తరువాత చలానాల నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లూ పడుతుంటారు. ఇవి ఒక్కోసారి పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తుంటాయి. బెంగళూరులో తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Bengaluru Viral Video).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, బైక్ వెనుక సీటుపై కూర్చొన్న ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో, చలానాకు భయపడిపోయిన అతడు కంగారులో ఏకంగా నెత్తిన మూకుడు పెట్టుకుని మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు. అతడి వెనుక ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేసిన నెట్టింట పెట్టాడు. ఇక వీడియో చూసిన జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అసలు అతడి మనసులో ఏముందో అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. మూకుడుతో చలానాను ఎలా తప్పించుకుందామని అనుకున్నాడో అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. టోపీకి బదులు మూకుడు వాడుతున్నాడేమో అని కామెంట్ చేసిన వారు కూడా ఉన్నారు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
తోక చుక్క చుట్టూ మిస్టరీ... ఎలాన్ మస్క్ సంచలన కామెంట్స్
వేల మందికి లేఆఫ్స్ ముప్పు.. వణికిపోతున్న అమెజాన్ ఉద్యోగులు