Share News

Amazon Layoffs: వేల మందికి లేఆఫ్స్ ముప్పు.. వణికిపోతున్న అమెజాన్ ఉద్యోగులు

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:02 PM

అమెజాన్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడు క్షణక్షణం భయంతో ఎలా బతుకీడుస్తున్నాడో చెబుతూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Amazon Layoffs: వేల మందికి లేఆఫ్స్ ముప్పు.. వణికిపోతున్న అమెజాన్ ఉద్యోగులు
Amazon Layoffs Fear

ఇంటర్నెట్ డెస్క్: లేఆఫ్స్ భయాలతో అమెజాన్ సంస్థ ఉద్యోగులు వణికిపోతున్నారంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియక కంటి మీద కునుకు లేకుండా భయం భయంగా ఉంటున్నారని సదరు నెటిజన్ చెప్పాడు. పనిలో వెనకపడ్డ ఉద్యోగులతో పాటు ప్రతిభావంతులను కూడా లేఆఫ్స్ భయం వెంటాడుతోందని అన్నాడు. అమెజాన్‌లో పని చేస్తున్న తన స్నేహితుడి పరిస్థితిని వివరిస్తూ ఆ నెటిజన్ పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.

లేఆఫ్స్‌తో ప్రతిభావంతులకూ చుక్కలు కనిపిస్తాయంటూ సదరు నెటిజన్ ఈ పోస్టు పెట్టారు. అమెజాన్‌లో పని చేస్తున్న తన ఫ్రెండ్ ఎంతటి నరకం అనుభవిస్తున్నాడో కళ్లకు కట్టినట్టు వివరించారు.

‘నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు అమెజాన్‌లో పనిచేస్తున్నాడు. చాలా టాలెంటెడ్ వ్యక్తి. జనాలు కనీసం మాటల్లో కూడా చెప్పలేని టెక్నికల్ సమస్యలను సులువుగా పరిష్కరిస్తాడు. కానీ లేఆఫ్స్ ప్రకటన వెలువడిన నాటి నుంచీ అతడు నిత్యం భయంతో వణికిపోతున్నాడు’

‘అతడికి కంటి నిండ్రా నిద్ర ఉండట్లేదు. రాత్రిళ్లు రెండు మూడు గంటలకు మించి నిద్రపోవట్లేదు. లేఆఫ్స్ ఈమెయిల్స్‌ అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున వస్తాయని ఓసారి నాతో చెప్పాడు. దీంతో, అతడు రాత్రంతా మేల్కునే ఉంటూ ఫోన్ నోటిఫికేషన్స్ చూస్తుంటాడు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ భయంతో వణికిపోతాడు. ఒక ఈమెయిల్‌ ఇంతగా భయపెడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి.

Layoffs Fear 2.jpg


‘ప్రతిభావంతులు కూడా లేఆఫ్స్ భయంతో వణికిపోతుండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఫోన్‌కు ఆందోళన కారకంగా మారుతుంది. లేఆఫ్స్‌తో కలిగే ప్రభావాలు, లేదా లేఆఫ్ తప్పదన్న భయం ఉద్యోగులను ఎంతగా ప్రభావితం చేస్తుందో ఒక్క కార్పొరేట్ సంస్థ కూడా మాట్లాడదు. ఇది నిజంగా దారుణం. లేఆఫ్స్ కంటే ముందు లేఆఫ్స్ భయమే ఉద్యోగులను కోలుకోలేని దెబ్బ కొడుతోంది’ అని రాసుకొచ్చాడు.

ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తామూ ఇలాంటి నరకం చూస్తున్నామని అన్నారు. అమెజాన్‌లో అనేక మంది జీవితం ఇలాగే ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యాకే ఈ భయం వదులుతుందని సూచించారు. అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి లేఆఫ్స్‌కు భయపడాల్సిన అవసరమే లేదని మరికొందరు అన్నారు.


ఇవీ చదవండి:

వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు

రైల్లో కిటికీ పక్కన మహిళ.. ప్లాట్‌ఫాంపై పోలీసు సడెన్‌గా ఆమె ఫోన్ లాక్కోవడంతో..

Read Latest and Viral News

Updated Date - Nov 01 , 2025 | 03:15 PM