Man Sues Wifes Lover: వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:53 PM
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై కోర్టుకెక్కాడో వ్యక్తి. అతడికి మానసిక వేదన కలిగించినందుకు వివాహిత లవర్ రూ.37 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: తైవాన్‌లో తాజాగా ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె భర్తకు రూ.37 లక్షల పరిహారం చెల్లించాలని స్థానిక కోర్టు తాజాగా ఆదేశించింది (Taiwan lawsuit affair).
మీడియా కథనాల ప్రకారం, వేయ్ అనే వ్యక్తి 2006లో జీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్ల పాటు వారి సంసారం సాఫీగానే సాగిపోయింది. జీ ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అదే స్కూల్‌లోని అకౌంటింగ్ డైరెక్టర్‌గా ఉన్న యాంగ్‌తో ఆమెకు 2022లో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరినొకరు భార్యాభర్తలుగా సంబోధించుకునే వరకూ వారి సాన్నిహిత్యం వెళ్లింది. ఓ రోజు భార్య ఫోన్ చూసిన వేయ్‌కు ఈ సంబంధం గురించి తెలిసింది. దీంతో అతడు యాంగ్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు. తనకు మానసిక వేదన కలిగించినందుకు యాంగ్ రూ. కోటి (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే) పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు (court ruling infidelity).
యాంగ్ మాత్రం పరిహారం ఇచ్చేందుకు నిరాకరించాడు. జీకి పెళ్లి అయిన విషయం తనకు తెలియదని అన్నాడు. కోర్టు అతడి వాదనలను తోసి పుచ్చింది. అప్పటికే వేయ్ పలు మానసిక సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. అతడికి యాంగ్ రూ.37 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.
వివాహేతర సంబంధం నేరం కాదని తైవాన్ రాజ్యాంగ ధర్మాసనం 2020లో తీర్పు వెలువరించింది. అయితే, ఈ సంబంధాలకు బాధితులుగా మారిన వారు తమ జీవిత భాగస్వామితో పాటు వారి లవర్స్‌పై కూడా కేసు వేయొచ్చు. జీవితభాగస్వామిగా తమకున్న హక్కులు ఉల్లంఘించినందుకు, మానసిక వేదన కలిగించినందుకు పరిహారం కోరవచ్చు.
ఇవీ చదవండి:
రైల్లో కిటికీ పక్కన మహిళ.. ప్లాట్‌ఫాంపై పోలీసు సడెన్‌గా ఆమె ఫోన్ లాక్కోవడంతో..
దరిద్రంలో మగ్గుతుండగా బంపర్ లాటరీ.. ఆ సంబరంలో ఉండగానే ఊహించని షాక్