Phone Snatching: రైల్లో కిటికీ పక్కన మహిళ.. ప్లాట్‌ఫాంపై పోలీసు సడెన్‌గా ఆమె ఫోన్ లాక్కోవడంతో..
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:07 PM
రైల్లో చోరీలు జరిగే తీరుపై ఆర్పీఎఫ్ అధికారి ఓ మహిళకు ఎన్నడూ మర్చిపోలేని విధంగా అవగాహన కల్పించిన తీరు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ వైరల్ వీడియో చూసిన జనాలు ఆ ఆర్పీఎఫ్ అధికారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రైలు జర్నీలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. రైళ్లల్లో కిటీక పక్క సీటులో కూర్చున్నాక లోకాన్ని మర్చిపోయే ప్రయాణికులు ఎందరో ఉంటారు. ఈ పరధ్యానం వచ్చే ఇబ్బందులపై అవగాహన కల్పించేందుకు ఓ ఆర్పీఎఫ్ అధికారి చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Train Phone Theft Awareness).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్లీపర్ క్లాస్ బోగీలో ఓ మహిళ కిటికీ పక్క సీటులో కూర్చుకుంది. తన చేయిని కిటికీపై పెట్టి ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ లోకాన్నే మర్చిపోయింది. ఇలా చేస్తే దొంగలు ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయే ముప్పు పెరుగుతుంది. మహిళకు ఈ విషయంపై అవగాహన లేకపోవడమో లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆమె మాత్రం ఫోన్‌లో మాట్లాడుతూ ప్రపంచాన్ని మర్చిపోయింది (RPF officer hero).
మహిళ చేస్తున్న పొరపాటును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి గుర్తించారు. ఆమె చేస్తున్న తప్పు ఏమిటో తెలియజెప్పాలని అనుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. రైలు వద్దకు వెళ్లి అకస్మాత్తుగా రైలు కిటికీలోకి చేయి పెట్టి ఆమె ఫోన్‌ను లాగేసుకున్నారు. దీంతో, ఆమె షాకయిపోయింది. పక్కకు తిరిగి చూసే సరికి పోలీసు కనబడటంతో మరింత స్టన్ అయ్యింది. ఆ వెంటనే ఫోన్‌ను మహిళకు తిరిగిచ్చేసిన అధికారి ఆమెను అప్రమత్తం చేశారు. కిటికీకి దగ్గరగా ఫోన్ పట్టుకుని ఉంటే చోరీ ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. దీంతో, మహిళకు కూడా తను చేసిన తప్పు ఏమిటో అర్థం అయ్యింది (RPF action news).
ఇక ఈ వీడియోకు జనాలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మహిళ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని విధంగా అవగాహన కల్పించారని కొందరు అన్నారు. మహిళకు కొద్దిలో హార్ట్ ఎటాక్ ముప్పు తప్పిపోయిందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
న్యూయార్క్ సూపర్‌మార్కెట్‌లో షాకింగ్ సీన్.. కస్టమర్ల మధ్య తీవ్ర ఘర్షణ.. వైరల్ వీడియో
దరిద్రంలో మగ్గుతుండగా బంపర్ లాటరీ.. ఆ సంబరంలో ఉండగానే ఊహించని షాక్