Mallikarjun Kharge: యుద్ధం మొదలైంది.. బీజేపీకి ఖర్గే వార్నింగ్
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:42 PM
బీజేపీ, ఆర్ఎస్ఎస్,. హిందూ మహాసభ రాజ్యాంగం ప్రతులను, నెహ్రూ విగ్రహాన్ని దగ్ధం చేసినట్టు ఖర్గే ఆరోపించారు. చరిత్రను అర్ధం చేసుకోకుండా మాట్లాడటం నయవంచనేనని అన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నిప్పు (Fire) అని, నిప్పుతో పెట్టుకుంటే బీజేపీ బతికి బట్టకట్టలేదని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అబేండ్కర్‌ను బీజేపీ అవమానపరచడంపై కర్ణాటకలోని బెలగావి (బెలగావి)లో మంగళవారంనాడు జరిగిన ''జై బాపు, జై భీమ్, జై సంవిధాన్'' కన్వెన్షన్‌లో ఖర్గే ప్రస్తావిస్తూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Ramayana: మహాకుంభ్‌లో 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' స్క్రీనింగ్
''మీరు (బీజేపీ) ఒకసారి రాజ్యాంగానికి నిప్పుపెట్టారు. అంబేడ్కర్, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఫోటోలకు మసిపూసి వాటి రూపుమార్చారు. గుర్తుంచుకోండి.. మీరు మాతో పెట్టుకుంటే, మేము నిప్పులాంటి వాళ్లం. కాలిపోతారు, బతికి బట్టకట్టలేరు. మమ్మల్ని రెచ్చగొట్టకండి. ఇతరులను ఎల్లకాలం రెచ్చగొడుతూ పోతే ఎంతోకాలం మనుగడ సాగించలేరు'' అంటూ ఖర్గే బీజేపీపై నిప్పుల వర్షం కురిపించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించినట్టు బీజేపీ చెబుతోందని, అలాంటి పని ఎప్పటికీ జరగదని అన్నారు.
''పార్లమెంటు భవనం ముందు అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిందెవరు? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో, పంజాబ్‌కు చెందిన హుకుం సింగ్ స్పీకర్‌గా ఉన్నప్పుడు విగ్రహావిష్కరణ జరిగింది. ఈరోజు అబేండ్కర్ విగ్రహాన్ని ఒక మూలకు, ఎవరూ గుర్తించని చోటకు నెట్టేశారు'' అని ఖర్గే విమర్శించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్,. హిందూ మహాసభ రాజ్యాంగం ప్రతులను, నెహ్రూ విగ్రహాన్ని దగ్ధం చేసినట్టు ఖర్గే ఆరోపించారు. చరిత్రను అర్ధం చేసుకోకుండా మాట్లాడటం నయవంచనేనని అన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఏకగ్రీవంగా రెండుసార్లు ఎన్నుకుందని చెప్పారు. అబేండ్కర్‌ను ఎన్నుకునేందుకు ముంబైకి చెందిన ఎంఆర్ జయకర్ రాజ్యసభ సీటుగా రాజీనామా చేశారని గుర్తు చేశారు. ''మరి బీజేపీ చేసినదేమిటి? రాజ్యాంగం ప్రతులను దగ్ధం చేసిందని అన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేడ్కర్‌కు చోటు కల్పించిందెవరని బీజేపీని నిలదీశారు.
''త్రివర్ణ పతాకాన్ని జాతీయ చిహ్నంగా మీరు ఒప్పుకోరు. దానికి మీరు సిగ్గుపడతారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు తమ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని కనీసం ఎగురవేయరు'' అని ఎద్దేవా చేశారు. సంవిధాన్ బచావో ఉద్యమం కోసం రాహుల్ గాంధీ చేసిన కృషిని ఖర్గే ప్రశంసించారు. ఇందుకోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 'భారత్ జోడో యాత్రను' రాహుల్ నిర్వహించారని అన్నారు. మరి మీ సంస్థ చేసినదేమిటని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ సారథ్యంలో స్వాతంత్ర్య పోరాటం సాగిస్తే అందులో పాల్గొనవద్దని ప్రజలకు జన్ సంఘ్ పిలుపునిచ్చిందన్నారు.
ఆ ఇద్దరూ నాకన్నా చిన్న..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా తనకంటే చిన్నవాళ్లని ఖర్గే గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా అంబేడ్కర్ను హోం మంత్రి అవమానించారని, తాము నిరసనలు తెలపడంతో పాటు ఆయన రాజీనామాకు డిమాండ్ చేశామని చెప్పారు. ''యుద్ధం మొదలైంది'' అని ఖర్గే డిక్లేర్ చేశారు. బెలగావి సదస్సులో ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అస్వస్థత కారణంగా హాజరుకాలేదు. దీనికి ముందు బెలగావి శివార్లలోని సువర్ణ సౌథ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు.
ఇది కూడా చదవండి..
Gautam Adani: 50 లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేయనున్న గౌతమ్ అదానీ
Hero Vijay: ఆ ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..
Read More National News and Latest Telugu News