Heliconia Plant: ప్రధాని మోదీ, పుతిన్‌ల మధ్య అరుదైన మొక్క.. ప్రత్యేకతలు ఇవే!
ABN , Publish Date - Dec 06 , 2025 | 10:56 AM
శుక్రవారం పుతిన్ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్ భవన్‌లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జాతీయం, డిసెంబర్ 05: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అలానే శుక్రవారం పుతిన్ (Vladimir Putin), ప్రధాని మోదీ (PM Narendra Modi) మధ్య హైదరాబాద్ భవన్‌లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, పసుపు రంగులతో ఎంతో స్పెషల్ గా ఉన్న ఈ మొక్క అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ మొక్క పేరు ఏమిటి, దాని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌ను తెగ వెతికేస్తున్నారు.
హెలికోనియా ప్రత్యేకతలు ఇవే:
ఇరు దేశాధినేతల మధ్యలో ఆకర్షణీయంగా కనిపించిన ఆ మొక్క పేరు హెలికోనియా (Heliconia). సానుకూల శక్తికి ప్రతీకగా దీన్ని భావిస్తుంటారు. వృద్ధి, శ్రేయస్సు, సమతుల్యత, సామరస్యాలతో పాటు కొత్త ఆరంభాలు, ముందడుగులకు శుభ పరిణామంగా ఈ మొక్కను భావిస్తారు. అలానే ఇరుదేశాల మధ్య సంబంధాలు , మెరుగుపడటానికి అలాగే అభివృద్ధి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్క గురించి నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాదు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. హెలికోనియా మొక్క ప్రకృతిలోనే ఒక ప్రత్యేక ఆకర్షణ.![]()
దీని పువ్వులు రంగురంగులుగా, కళ్లకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే ప్రత్యేక సమావేశాలు, చర్చలు, డిప్లోమాటిక్ ఈవెంట్స్‌లో దీనిని అలంకరణగా ఉపయోగించడం ఒక సాంప్రదాయంగా కూడా మారింది. అలానే అత్యున్నతస్థాయి దౌత్య సమావేశాల కోసం సిద్ధం చేసే గదుల్లో ఏ వస్తువైనా సరే యాదృచ్ఛికంగా ఉంచరు. పూలు, రంగులు, బ్యాక్‌గ్రౌండ్ వంటివి పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అందువల్ల, భారత్, రష్యా మధ్య స్నేహ బంధానికి, ద్వైపాక్షిక సహకార పురోగతికి ప్రతీకగా హెలికోనియా మొక్కను కావాలనే ఏర్పాటుచేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: