Vice‑President Election: ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే.. కాసేపట్లో పార్లమెంట్‌కు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి
ABN , Publish Date - Sep 09 , 2025 | 09:39 AM
ఉపరాష్ట్ర పతి ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. కొన్ని గంటల్లో ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాత్రికి ఫలితాలు బయటకు వస్తాయి.
ఉపరాష్ట్ర పతి ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. కొన్ని గంటల్లో ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాత్రికి ఫలితాలు బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధా కృష్ణన్ (C.P. Radhakrishnan) మరికాసేపట్లో పార్లమెంట్‌కు చేరుకోబోతున్నారు. కాసేపటి క్రితం లోధి రోడ్‌లోని రామ మందిరంలో రాధా కృష్ణన్ పూజలు నిర్వహించారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి (B. Sudarshan Reddy) కూడా పార్లమెంట్‌కు చేరుకోనున్నారు (Vice President election 2025).
ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలను బీఆర్‌ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు బహిష్కరించాయి. బీఆర్‌ఎస్ (4), బీజేడీ (7), శిరోమణి అకాలీదళ్(1) పార్టీల ఎంపీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారు. కాగా, ఎన్డీయే సంఖ్యా బలం లోక్ సభలో 304, రాజ్యసభలో 141గా ఉంది. బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన(షిండే), లోక్ జనశక్తి(చిరాగ్ పశ్వాన్), అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్‌దళ్, అప్నాదళ్(సోనేలాల్), ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం,ఆల్ జార్ఖండ్ స్టుడెంట్స్ యూనియన్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, సిక్కిం క్రాంతికారీ మోర్చా, ఏజీపీ,యుపిపిఎల్, ఆర్‌ఎల్ ఎం, ఆర్‌పీఐ, వైసీపీ, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు (NDA vs INDIA bloc).
కాగా, ఇండియా కూటమి ప్రస్తుత సంఖ్యాబలం లోక్ సభలో 234, రాజ్యసభలో 86గా ఉంది. ఇండియా కూటమికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్దవ్ థాకరే), ఎన్‌సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, జేఎంఎం, సీపీఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్,వీసీకే, భారత్ ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌టీపీ, ఆర్‌ఎ్‌సపీ, ఎంఎన్‌ఎం(కమల్ హాసన్) ఏజీఎం పార్టీలు మద్దతిస్తున్నాయి (BRS abstention). కాగా, 14వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 781 మంది ఎంపీలకు ఓటు వేసే హక్కుంది. అయితే ఎన్నికలకు బీఆర్‌ఎస్, బీజేడీ దూరం కావడంతో మొత్తం బలం 770కి తగ్గింది. దీంతో మెజార్టీ మార్కు 386గా ఉండనుంది.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News