UP Govt Caste Ban: ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసు రికార్డులు, పబ్లిక్ స్థలాల్లో కుల ప్రస్తావనల నిషేధం
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:23 PM
పోలీసు స్టేషన్లు, వాహనాలు, సైన్‌బోర్డులపై ఉన్న కుల చిహ్నాలు, స్లోగన్‌లు, ప్రస్తావనలను వెంటనే తొలగించాలని కూడా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, కుల ఆధారిత ర్యాలీలు నిషేధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉల్లంఘనలను కఠినంగా పరిశీలించాలని పోలీసులకు సూచనలు జారీ చేశారు.
లక్నో (ఉత్తరప్రదేశ్), సెప్టెంబర్ 22: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు(Allahabad High Court order) అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు రికార్డులు, పబ్లిక్ స్థలాల్లో కుల ప్రస్తావన పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) రాష్ట్ర కేంద్ర సచివాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్ట్ మెమోలు, ఇతర పోలీసు డాక్యుమెంట్లలో కుల ప్రస్తావనలు ఉండకూడదని, గుర్తింపునకు తల్లిదండ్రుల పేర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
పోలీసు స్టేషన్లు, వాహనాలు, సైన్‌బోర్డులపై ఉన్న కుల చిహ్నాలు, స్లోగన్‌లు, ప్రస్తావనలను వెంటనే తొలగించాలని కూడా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, కుల ఆధారిత ర్యాలీలు(UP govt news, caste slogans ban) నిషేధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉల్లంఘనలను కఠినంగా పరిశీలించాలని పోలీసులకు సూచనలు జారీ చేశారు.

అయితే, షెడ్యూల్డ్ కులాలు (SC) షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) (అత్యాచారాల నివారణ) చట్టం కింద వర్గీకరించబడిన కేసుల్లో కుల గుర్తింపు చట్టపరంగా అవసరం కావున దీనికి మినహాయింపు ఇచ్చారు. ఈ ఆదేశాల అమలుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లు (SOPs) పోలీసు మాన్యువల్‌లలో సవరణలు చేస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది.
ఇలా ఉండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు గోరఖ్‌పూర్‌లో జనతా దర్శన్ నిర్వహించి, ప్రజల ఫిర్యాదులు విని, వారి అభ్యర్థనలు స్వీకరించారు. అలాగే, షారదీయ నవరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తల్లి జీవితం సంతోషం, ఆరోగ్యం, సమృద్ధితో వర్థిల్లాలని సీఎం ఆకాంక్షించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News