Union Minister Pralhad Joshi: అన్ని జిల్లాల్లో హాల్‌మార్కింగ్ కేంద్రాలు..
ABN , Publish Date - May 27 , 2025 | 03:25 PM
దేశంలోని అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో మంగళవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది...
ఢిల్లీ: దేశంలోని అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. BIS గవర్నింగ్ కౌన్సిల్ కార్యదర్శి, BIS డైరెక్టర్ జనరల్ (DG) సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2014-15లో భారత్‌లో కేవలం 2,000 స్టాండర్డులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం (2025 నాటికి) ఈ సంఖ్య 23,000 స్టాండర్డులకు చేరిందని చెప్పారు. ప్రమాణీకరణ (Certification) సంఖ్యను 55,000 వరకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
భారత్ తయారు చేసిన స్టాండర్డుల్లో 95 శాతం హార్మోనైజ్డ్ (హార్మోనైజ్డ్ కమోడిటీ డిస్క్రిప్షన్ అండ్ కోడింగ్ సిస్టమ్).. అని చెప్పారు. భారత స్టాండర్డ్‌లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని, హాల్‌మార్కింగ్ విషయంలో అభివృద్ధి సాధించినట్లు వివరించారు. ఇప్పటివరకు 371 జిల్లాల్లో బంగారం హాల్‌మార్కింగ్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా అన్ని జిల్లాలో హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. త్వరలో కేంద్రం బులియన్ హాల్‌మార్కింగ్ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. వెండి ఆభరణాల కోసం విధాన నిర్ణయం తీసుకున్నామని, త్వరలో వెండి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ కోసం విధాన ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. భారతదేశంలో ప్రమాణాల పరిరక్షణ, నాణ్యత నియంత్రణ, వినియోగదారుల న్యాయహక్కుల పరిరక్షణలో BIS పాత్రను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు.. పాక్‌కు శశి థరూర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest National News and Telugu News