TVK functionary died: టీవీకే కార్యకర్త ఆత్మహత్య.. కరూర్ ఘటనపై సూసైడ్ నోట్
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:53 PM
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. కరూర్ జిల్లాలో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుమారం రేపుతున్న వేళ ఈ ఘటన మరింత సంచలనాలు సృష్టిస్తోంది.
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుమారం రేపుతున్న వేళ ఈ ఘటన మరింత సంచలనాలు సృష్టిస్తోంది. విల్లుపురం జిల్లాకు చెందిన అయ్యప్పన్ (51) చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది.
అయ్యప్పన్ (51) టీవీకే పార్టీ కార్యకర్త (TVK functionary). ఆయన ఆదివారం తన తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామమైన మైలంకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి మునియమ్మల్ చుట్టుపక్కల వారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయ్యప్పన్ గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు (Tamil Nadu stampede investigation).
విజయ్ ప్రచారం సందర్భంగా 41 మంది ప్రాణాలు కోల్పోయిన కరూర్ తొక్కిసలాటకు డీఎంకే మంత్రి కారణమని ఆ లేఖలో రాశారు (Karur tragedy). 'టీవీకే చీఫ్ విజయ్ కరూర్ వచ్చినప్పుడు తగినంత పోలీసు రక్షణ లేదు. మంత్రి సెంథిల్ బాలాజీ కారణంగానే ఈ విషాదం జరిగింది. ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉంది. మంత్రిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి' అని తన సూసైడ్ నోట్‌లో అయ్యప్పన్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్రంతో చర్చలు లేవు.. లెహ్ ఎపెక్స్ బాడీ సంచలన నిర్ణయం
క్రికెట్‌కు తప్పు లేదు కానీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటే నేరమా..
For More National News And Telugu News