Tungabhadra: పోటెత్తుతున్న తుంగభద్ర..
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:03 AM
తుంగభద్ర నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నది ఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
- కంప్లి తాలూకాలో జలమయమైన పంటపొలాలు
బెంగళూరు: తుంగభద్ర(Tungabhadra) నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నదిఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నదికి గత రెండు మూడు రోజులుగా 80 వేలకుపైగా నీరు నదికి రావడంతో అధికారులు గంగావతి, కంప్లి(Gangavati, Kampli) మధ్య కోటే తుంగభద్ర వంతెన పై ఎప్పుడూ నిలబెడతారోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ యేడాది పలుసార్లు కోటే వద్ద వంతెనపై వాహనాలు బంద్ చేయడంతో చాలా వరకు ఇబ్బందులకు గురయ్యామని తెలిపారు. ప్రస్తుతానికి మాత్రం వంతెనపై రాకపోకలు బంద్ చేపట్టలేదు. ఏ సమయంలో నదికి నీరు ఎక్కువగా పోటెత్తుతాయోనని దిగులు చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News