Share News

Tungabhadra: ఒక్కచాన్స్‌ ప్లీజ్.. తుంగభద్ర ఆయకట్టుకు రెండోసారి నీరు అనుమానమే

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:38 PM

తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్‌గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.

Tungabhadra: ఒక్కచాన్స్‌ ప్లీజ్.. తుంగభద్ర ఆయకట్టుకు రెండోసారి నీరు అనుమానమే

- మూడు రాష్ట్రాల బోర్డు అధికారుల సమావేశంలో నిర్ణయం..

బళ్లారి(కర్ణాటక): తుంగభద్ర(Tungabhadra) ఆయకట్టు క్రస్ట్‌గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది తుంగభద్ర ఆయకట్టు రైతులకు రెండో పంట అనుమానమే అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జలాశయం సంబంధించి మూడు రాష్ట్రాల అధికారులు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్ల సమావేశం బుధవారం ఆన్‌లైన్‌లో జరిగింది. నీటి సేకరణ, పంపిణీ గురించి ఇందులో సుదీర్ఘంగా చర్చించారు.


జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని తుంగభద్రమండలి ఇప్పటికే నిర్ధారించిన మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ సారి ఖరీ్‌ఫలో అధికంగా వర్షాలు ఉన్నటు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. జలాశయంలో 24 టీఎంసీల నీరు సంగ్రహణ జరిగింది. అయితే గరిష్టంగా 105.78 టీఎంసీలు చేరాల్సి ఉండగా , ఈ సారి సాధ్యం కాకపోవచ్చుని బోర్డు అధికారులు వివరించారు. తుంగభద్ర జలాశయం ఆనకట్ట ఎత్తు 1,633లు కాగా 1626 అడుగులకు నీరు చేరిన వెంటనే అదనంగా జలాశయానికి వచ్చే నీటిని నదికి విడుదల చేస్తున్నట్లు బోర్డు ఇంజనీర్లు తెలుపుతున్నారు.


pandu2.2.jpg

సాధారణంగా ఖరీఫ్‌ పంటలకు ప్రతి యేడాది కాలువల ద్వారా 80టిఎంసి నీటిని సరఫరా జరుగుతుంది. ఈ ఏడాదికూడా అందుకు ఇబ్బంది ఏమీ లేదు, 40 టీఎంసీల నీటిని తాగడానికి, పరిశ్రమలకు, ఇతరత్ర వాటికి రిజర్వు చేయనున్నారు. రబీ అవధిలో వర్షం వస్తే పరిస్థితి బట్టి నీటి లభ్యతను బట్టి జలాశయం నీరు లభించే అవకాశం ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సమావేశంలో కర్నూలు ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, అనంతపురం ఎస్‌ఈ పురంధన రెడ్డి, మునిరాబాద్‌ చీఫ్‌ఇంజనీయరు బసవరాజు, గద్వాల్‌ ఎస్‌ఈ రహిముద్దీన్‌, తుంగభద్ర మండలి ఎస్‌ఈ నారాయణ నాయక్‌లు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 01:38 PM