Tensions erupt in Vadodara: సోషల్ మీడియా పోస్ట్‌పై వడోదరలో తీవ్ర ఉద్రిక్తతలు.. 50 మంది నిర్బంధం
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:37 PM
సోషల్ మీడియా పోస్ట్‌తో ఆందోళనకు దిగిన ఒక వర్గం ప్రజలు దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రెచ్చిపోయిన పలువురు సమీపంలోని నవవరాత్రి మండపంపైన, పార్కింక్ చేసిన వాహనాలపైన దాడి చేశారు.
వడోదర: గుజరాత్ (Gujarat)లోని వడోదర (Vadodara)లో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఒక వర్గం ప్రజలు నవరాత్రి మండపాన్ని ధ్వంసం చేసి, పోలీసులపై దాడులకు దిగారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుతో వడోదరలోని జునాగఢ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తినట్టు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా పోస్ట్‌తో ఆందోళనకు దిగిన ఒక వర్గం ప్రజలు దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రెచ్చిపోయిన పలువురు సమీపంలోని నవరాత్రి మండపంపైన, పార్కింగ్ చేసిన వాహనాలపైన దాడి చేశారు. పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు.
కాగా, పరిస్థితిని వెంటనే పోలీసులు అదుపులోకి తెచ్చారు. హింసాకాండకు పాల్పడిన సుమారు 50 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వడోదర డీసీపీ ఆండ్రూ మాక్వాన్ తెలిపారు.
గత నెలలో జరిగిన గణేష్ చతుర్ధి ఉత్సవాల సమయంలోనూ వదోదరలో ఉద్రిక్తతలు తలెత్తాయి. వినాయకుని ఊరేగింపుపై ఒక వర్గం వారు గుడ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఇద్దరు వ్యక్తులను, ఒక మైనర్‌ను పోలీసులు అరెస్టు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై ఇద్దరు నిందితులు చేతులు జోడించి క్షమాపణలు చెప్పినట్టు ఒక వీడియో కూడా ఆ తర్వాత వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలోని రోహిణిలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు గోగి గ్యాంగ్ సభ్యుల అరెస్టు
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..