Share News

Veerappan: వీరప్పన్‌ బంధువు మృతిపై అనుమానం..

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:57 AM

గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌(Veerappan) బంధువు అర్జున్‌ అనుమానాస్పద మృతిపై 30 ఏళ్ల అనంతరం విచారణకు ఆదేశించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.

Veerappan: వీరప్పన్‌ బంధువు మృతిపై అనుమానం..

- 30 ఏళ్ల అనంతరం విచారణకు ఆదేశించలేమన్న హైకోర్టు

చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌(Veerappan) బంధువు అర్జున్‌ అనుమానాస్పద మృతిపై 30 ఏళ్ల అనంతరం విచారణకు ఆదేశించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వీరప్పన్‌ బంధువు అర్జునన్‌, 1995 సెప్టెంబరులో విచారణ కోసం పోలీసులు తీసుకెళ్లగా, అప్పటి నుంచి కనిపించలేదు. ఈ నేపథ్యంలో, ధర్మపురి కోర్టులో అర్జునన్‌పై ఉన్న కేసుల విచారణ సమయంలో, అర్జునన్‌ మృతిచెందినట్లు పోలీసు శాఖ తరపున అఫిడివిట్‌ దాఖలుచేయడంతో ఆయనపై ఉన్న కేసుల విచారణ ముగిసినట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: వామ్మో.. బస్సులో సీటు కోసం పట్టా కత్తులు.. భీతిల్లిన ప్రయాణికులు


nani2.2.jpg

ఈ నేపథ్యంలో, తన తండ్రి మృతిపై విచారణ చేపట్టాలని, పోలీస్‏స్టేషన్‌లో అతను మృతిచెందిన కారణంగా రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరుతూ అర్జునన్‌ కుమారుడు సతీష్‏కుమార్‌ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశాడు. ఈ కేసులో ఇరుతరఫు వాదనల అనంతరం, 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించలేమని, పోలీసుల దాడిలో అర్జునన్‌ మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ న్యాయమూర్తి భరత్‌ చక్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ కొట్టివేసింది.


nani2.jpg

ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 12:01 PM