Supreme Court: జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్..
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:15 AM
Justice Yashwant Varma Case: నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. నోట్ల కట్టల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ నియామకం సబబేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
Justice Yashwant Varma Case: నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. నోట్ల కట్టల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ నియామకం సబబేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు విస్పష్టమైన తీర్పునిచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కాగా, తన ఇంట్లో లభించిన నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడాన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతేకాదు.. తన అభిశంసనకు అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా చేసిన సిఫారసును కూడా జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పుపట్టారు. ఎక్స్ పేరుతో జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ఇందులో లేవనెత్తిన అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కావని ధర్మాసనం తేల్చి చెప్పింది.
Also Read:
బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో పెను ప్రమాదం..
మగ్గాలతో అద్భుతాలు సృష్టించిన నేతన్నలకు
For More National News and Telugu News..