Supreme Court Directs EC: ఆధార్‌కార్డును అంగీకరించాల్సిందే
ABN , Publish Date - Aug 23 , 2025 | 02:51 AM
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా జాబితాలో పేర్లను కోల్పోయిన వారిలో ఎవరైనా తమ ఆధార్ కార్డును చూపించి తిరిగి ఓటరుగా నమోదు కావచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ..
బిహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా జాబితాలో పేర్లను కోల్పోయిన వారిలో ఎవరైనా తమ ఆధార్ కార్డును చూపించి తిరిగి ఓటరుగా నమోదు కావచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ప్రజలను ఓటరు జాబితాలో చేర్చేందుకు ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని శుక్రవారం ఆదేశించింది. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం వాదనలను కొనసాగించింది. కొత్త ఓటర్ల జాబితాపై తమ అభ్యంతరాలను ఓటర్లు, బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏ) ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని సూచించింది. వ్యక్తిగతంగా బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్‌వో) దగ్గరికి వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించనక్కర్లేదని పేర్కొంది. అయితే, సవరించిన జాబితాపై ఇప్పటివరకు కేవలం బూత్ స్థాయిల నుంచి కేవలం రెండే అభ్యంతరాలు రావడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ, బూత్ లెవల్ ఆఫీసర్లు ఫిర్యాదులను స్వీకరించకపోవడమే ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ నేపథ్యంలోనే, ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను సమర్పించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News