Supreme Court Enforcement Directorate: విచారణే లేకుండా శిక్ష!
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:18 AM
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో శిక్షపడిన సందర్భాలు అతి తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఏళ్లుగా జైల్లో ఉంచుతున్న ఈడీ
బీపీఎస్‌ఎల్ కేసులో సీజేఐ వ్యాఖ్య
ఈడీ బాగా పనిచేస్తోంది: ఎస్జీ
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో శిక్షపడిన సందర్భాలు అతి తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులకు శిక్ష పడేలా చేయలేక పోయినా వాళ్లను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైళ్లలో ఉంచడం ద్వారా శిక్షించడంలో ఈడీ విజయం సాధించిందని వ్యాఖ్యానించింది. ఈడీ చేపట్టిన కేసుల్లో నేర నిరూపణ జరిగిన వాటి శాతం ఎంతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ప్రశ్నించింది. భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎ్‌సఎల్) కంపెనీని జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌కు అప్పగించే ప్రతిపాదనను ఇటీవల సుప్రీంకోర్టు నిలువరించింది. దివాలా చట్టంలోని పలు నిబంధనలకు విరుద్ధంగా ఈ అప్పగింత ప్రయత్నం ఉందని వ్యాఖ్యానించింది.
ఈ తీర్పుపై పునస్సమీక్షించాలని అప్పులు ఇచ్చిన బ్యాంకులు, బీపీఎ్‌సఎల్‌ను కొనాలనుకుంటున్న జేఎ్‌సడబ్ల్యూ స్టీల్ సంస్థ సుప్రీంకోర్టును కోరాయి. గురువారం విచారణ సందర్భంగా బీపీఎ్‌సఎల్ కుంభకోణం విచారణ కొలిక్కిరాని విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇన్నేళ్లయినా ఈడీ కుంభకోణం విచారణను కొలిక్కి తీసుకు రాలేక పోయిందని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బ్యాంకుల తరఫున హా జరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈడీ చాలా బాగా పనిచేస్తోందన్నారు. ఈడీ ఇప్పటిదాకా వివిధ కుంభకోణాలకు సంబంధించి నిందితుల నుంచి రూ.23,000 కోట్లు వసూలు చేసి బాధితులకు అప్పగించిందని తెలిపారు. తమకు ప్రచారం చేసుకునే అవకాశం లేకుండాపోయిందన్నారు. ఈ సందర్భంగా, సీజేఐ స్పందిస్తూ, ఈడీ కేసుల్లో శిక్షలు పడటమే చాలా తక్కువగా ఉందని, విచారణ లేకుండా జైళ్లలో ఉంచడం ద్వారా ఈడీ నిందితులకు శిక్షలు విధిస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
For More National News and Telugu News