CJI SuryaKant: ఢిల్లీ కాలుష్యంపై సీజేఐ సూర్యకాంత్ ఆందోళన
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:10 PM
ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
ఢిల్లీ, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ కాలుష్యం (Delhi Pollution)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI SuryaKant) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ– ఎన్‌సీఆర్‌లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వెంటనే స్వచ్ఛమైన గాలి వచ్చేలా తాము ఏం ఆదేశించగలమని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యాయస్థానాలు ఎలాంటి అద్భుతాలు చేయలేవని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కాలుష్యంపై అత్యవసరంగా కేసు విచారణ జరపాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.
ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. పొగమంచుకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా అంచనా వేయగలిగేది సైంటిస్టులు మాత్రమేనని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం ఏయే కమిటీలను ఏర్పాటు చేసిందో, ప్రతి ప్రాంతంలో ఏ పరిష్కారాలు సాధ్యమో స్టడీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ కాలుష్యం నివారణ కోసం దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని తెలిపారు. ఈ కాలుష్యం ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో తెరపైకి వస్తుందని గుర్తుచేశారు. చలికాలం ముగిసిన తర్వాత కాలుష్యం మళ్లీ మాయమవుతుందని వివరించారు. ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని తెలిపారు. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో వచ్చే సోమవారం విచారణ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News