Share News

Chennai: ఆ విద్యార్థినికి 437 మార్కులొచ్చాయ్..

ABN , Publish Date - May 09 , 2025 | 01:41 PM

బస్సుకోసం పరుగెత్తుతున్నా.. ఆపకుండా పోయిన డ్రైవర్.. అంటూ రెండు నెలల క్రితం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచిన ప్లస్‌ టూ చదువుతున్న సుహాసిని అనే విద్యార్ధినికి 437 మార్కులొచ్చాయి. బస్సు వెంబడి పరుగెత్తుతున్నా ఆపని విషయంపై డ్రైవర్‌, కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటుపడిన సంగతి తెలిసిందే.

Chennai: ఆ విద్యార్థినికి 437 మార్కులొచ్చాయ్..

- బస్సు వెనుక పరుగెత్తుతూ.. పాఠశాలకు

చెన్నై : తిరుపత్తూర్‌ జిల్లా వాణియంబాడి సమీపం కొత్తకోట ప్రాంతానికి చెందిన సుహాసిని(Suhasini), ఆలంగాయంలోని ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతోంది. మార్చి 5వ తేది ప్రారంభమైన పబ్లిక్‌ పరీక్షల కోసం సుహాసిని ప్రతిరోజు స్వగ్రామం నుంచి బస్సులో పరీక్షా కేంద్రానికి వెళుతుంది. 25న జరిగే పరీక్షకు వెళ్లేందుకు ఆమె బస్సు కోసం వేచి ఉండగా, డ్రైవర్‌ బస్సు ఆపలేదు. దీంతో సుహాసిని వేగంగా వెళుతున్న బస్సు వెనుకాలే పరుగులు తీసింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: కన్నీరు వద్దు తంబీ.. దివ్యాంగ విద్యార్థికి సీఎం స్టాలిన్‌ భరోసా


కొద్దిదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌ బస్సు ఆపడంతో ఆమె బస్సులో పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. ఆ సమయంలో బస్సు వెనుకగా వస్తున్న వాహనచోదకులు సుహాసిని బస్సు వెనుక పరుగులు తీస్తున్న దృశ్యాలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో, డ్రైవర్‌, కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఈ నేపథ్యంలో, గురువారం వెలువడిన ఫలితాల్లో సుహాసిని 437 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించింది.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..

ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2025 | 01:48 PM