Sudha Murthy:స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:12 PM
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి నిత్యం వార్తల్లో నిలుస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు.
బెంగళూరు, నవంబర్ 13: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి నిత్యం వార్తల్లో నిలుస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. ఒక వివాహ వేడుకలో ఆమె సెప్ట్‌లు వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ రిసెప్షన్ తాజాగా బెంగళూరులోని ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డప్పుల వాయించారు. ఆ డప్పులకు అనుగుణంగా సుధా మూర్తి సెప్టులు వేశారు.
ఆమెతో పాటు కిరణ్ మజుందార్ సైతం డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ ఘటనకు 'ఉకాసా' సూత్రధారా.?
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
For More National News And Telugu News