Share News

MK Stalin: ఎన్‌ఈపీ కాదు, కాషాయ పాలసీ.. మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

ABN , Publish Date - Mar 12 , 2025 | 09:46 PM

మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ అనేది జాతీయ విద్యావిధానం కాదని, దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన 'కాషాయ పార్టీ విధానం' అని చెన్నైలో బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.

MK Stalin: ఎన్‌ఈపీ కాదు, కాషాయ పాలసీ.. మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

చెన్నై: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ అనేది జాతీయ విద్యావిధానం కాదని, దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన 'కాషాయ పార్టీ విధానం' అని చెన్నైలో బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో అన్నారు. బీజేపీ ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విజన ప్రక్రియపై కూడా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలవడం ద్వారా అధికారాన్ని స్థిరం చేసుకోవాలన్న ఆ పార్టీ ఆలోచనలో భాగమే ఈ ప్రక్రియ అని విమర్శించారు.

Ranya Rao: రన్యారావుకు పెళ్లికి హాజరైన సీఎం.. వెలుగుచూసిన ఫోటో


బీజేపీ తమకు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలను పెంచుకుని, పార్టీని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటోందని, ఈ ప్రయత్నాన్ని డీఎంకే అడ్డుకుంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. "ఎన్‌ఈపీని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఇది తమిళనాడు విద్యా వృద్ధిని సమూలంగా నాశనం చేస్తుంది. సామాజిక న్యాయం అందించే రిజర్వేషన్లను ఎన్‌ఈపీ అంగీకరించదు. వృత్తివిద్య పేరుతో కుల ఆధారిత విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది'' అని స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు.


కాగా, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న స్టాలిన్ దీనిపై కలిసిరావాలని ఏడు రాష్ట్రాలకు ఇప్పటికే లేఖలు రాశారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి పార్లమెంటులో పోరాడాలని డీఎంకే ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి..

Udayanidhi: పిల్లల్ని కనండి కానీ...ఉదయనిధి నోట అదేమాట.

Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..

Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2025 | 09:46 PM