Chennai: రామసేతు వంతెనపై వాకింగ్..
ABN , Publish Date - May 03 , 2025 | 01:28 PM
నాగపట్టణం నుంచి కాంగేశన్ హార్బర్‌కు ఒక్క మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికుల నౌకా సేవలు ప్రారంభించామని నాగపట్టణం నుంచి శ్రీలంకకు నౌకలు నడుపుతున్న ‘శుభం’ సంస్థ డైరెక్టర్ సుందరరాజన్ తెలిపారు. అలాగే.. రామసేతు వంతెనపై కి.మీ నడిచి వెళ్లి దర్శించుకునేలా ఆధ్మాత్మిక, సాంస్కృతిక పర్యటన అందించనున్నట్లు ఆయన తెలిపారు.
- నౌకా సంస్థ టూర్ ప్యాకేజ్
చెన్నై: రామసేతు(Ramasethu) వంతెనపై కి.మీ నడిచి వెళ్లి దర్శించుకొనేలా ఆధ్మాత్మిక, సాంస్కృతిక పర్యటన అందించనున్నట్లు నాగపట్టణం(Nagapattanam) నుంచి శ్రీలంకకు నౌకలు నడుపుతున్న ‘శుభం’ సంస్థ డైరెక్టర్ సుందరరాజన్(Sundara Rajan) తెలిపారు. ఈ మేరకు నాగపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాగపట్టణం నుంచి కాంగేశన్ హార్బర్‌కు ఫిబ్రవరి 22వ తేది నుంచి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికుల నౌకా సేవలు ప్రారంభించామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: ఆ శాఖ ఉద్యోగులకు మంత్రి సీరియస్ వార్నింగ్.. విషయం ఏంటంటే..
నౌకలో ప్రయాణికులు 22 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతించామని తెలిపారు. ప్రారంభంలో రూ.9,200లుగా నిర్ణయించిన ఛార్జీ, అనంతరం రూ.8,500లకు తగ్గించగా, ప్రస్తుతం మరో రూ.500 తగ్గించి రూ.8వేలు వసూలుచేస్తున్నామన్నారు. అలాగే, పర్యాటకులను ఆకట్టుకొనేలా సరికొత్త పర్యాటక రాయితీ అందిస్తున్నామని తెలిపారు. ఆ ప్రకారం, రూ.15,000 ప్యాకేజీలో రెండువైపులా ఛార్జీలు, వాహనం, మూడు రాత్రుల బస వసతితో అందిస్తున్నామన్నారు.
మరో ప్యాకేజీలో... శ్రీలంకలో ఐదు రాత్రులు, ఆరు రోజు లు బస, ఆహారం, వాహనం తదితరాలకు ఒక వ్యక్తికి రూ.30,000 ఛార్జీ నిర్ణయించామన్నారు. ఈ ప్యాకేజీలో ముఖ్యాంశంగా రామసేత వంతెనపై గంటసేపు నడక, రామాయణంతో సంబంధాలున్న సీతావనం, అశోక వనం, రావణుడి గుహలు, ప్రసిద్ధిచెందిన ప్రాచీన ఆలయాలు, పురాణ ప్రాంతాలు తదితరాలను వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక, పాఠశాల విద్యార్థులకు టిక్కెట్టు ధరలో 10 శాతం రాయితీ, వారితో వెళ్లే ఒక ఉపాధ్యాయుడికి ఉచిత టిక్కెట్ ఇవ్వనున్నామన్నారు.
జూన్ మొదటి వారం నుంచి మూడు గంటల్లో శ్రీలంకకు చేరుకొనేలా 250 మంది ప్రయాణికుల సామర్ధ్యం కలిగిన మరో నౌకను ప్రారంభించనున్నామని, జూన్ మొదటి వారం నుంచి సరుకుల నౌక ప్రారంభించనున్నామన్నారు. అలాగే, రామేశ్వరం నుంచి శ్రీలంకకు, నాగపట్టణం నుంచి వేలాంకన్నికి పర్యాటకుల నౌకలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News