తిరుమల బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:11 PM
తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.
చెన్నై: తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.

ఈ వేడుకలకు పాల్గొనే భక్తుల సౌకర్యార్ధం చెన్నై, తిరుచ్చి, తంజావూరు(Chennai, Tiruchi, Tanjavuru), సేలం, కోయంబత్తూర్, మదురై, కారైక్కుడి, కుంభకోణం, నాగపట్టణం, సెంగోట్టై తదితర ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala)కు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. భక్తులు www.tnstc.in అనే వెబ్‌సైట్‌లో ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఎస్‌ఈటీసీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News