Share News

Amith Shah: ఎంపీ స్థానాల పునర్విభజనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 08:41 PM

Amith Shah: త్రిభాషా విధానం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. కాదు ద్విభాష విధానమంటూ తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో తమిళనాడు, కేంద్ర మధ్య పోరు మొదలైంది. అలాంటి వేళ.. తమిళనాడులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కోయంబత్తురులో కీలక వ్యాఖ్యలు చేశారు.

Amith Shah: ఎంపీ స్థానాల పునర్విభజనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Home Minister Amit Shah

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా జరగనున్న లోక్‌సభ నియోజవర్గాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో అమిత్ షా మాట్లాడుతూ.. పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో దక్షిణాదిలోని ఏ రాష్ట్రం ఒక్క లోక్‌సభ స్థానాన్ని సైతం కోల్పోయే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా దక్షిణాదిలో లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

Also Read: Lord Shiva: కొమ్ముల మధ్య నుంచి శివుడిని ఎందుకు దర్శించుకొంటారు

దక్షిణాది ప్రజల ఆంకాక్షలను ప్రధాని మోదీ.. తన మనస్సులో పెట్టుకున్నారని తెలిపారు. లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రకారం.. దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలోనూ ఒక్క స్థానాన్ని కూడా తగ్గించమని లోక్‌సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని ఈ సందర్భంగా మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. తాను సైతం దక్షిణ భారతదేశ ప్రజలకు ఇదే భరోసా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమైన వాటా లభిస్తుందని.. అందులో ఏ మాత్రం సందేహమే లేదన్నారు.

Also Read: వంకాయ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


పునర్విభజన ప్రక్రియలో తమిళనాడు రాష్ట్రం 8 లోక్‌సభ స్థానాలను కోల్పొనుందంటూ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వెల్లడించారు. అంటే ప్రస్తుతం.. తమిళనాడులో 39 లోక్‌సభ సీట్లు ఉన్నాయని.. కానీ పునర్విభజన ప్రక్రియలో భాగంగా వాటి సంఖ్యను 31కి తగ్గించే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం స్థానాల సంఖ్య తగ్గింపు మాత్రమే కాదని.. ఇది మన హక్కుల గురించని ఆయన స్పష్టం చేశారు.

Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు


పునర్విభజన పేరుతో తమిళనాడు గొంతును అణచివేస్తున్నారని విమర్శించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి మన గొంతుకను వినిపించాలని అఖిల పక్షానికి పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 5వ తేదీన చెన్నైలో ఈ అంశంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని సీఎం స్టాలిన్ ఏర్పాటు చేశారు. అయితే సీఎం స్టాలిన్ ఈ ప్రకటన చేసిన మరునాడే.. కేంద్ర మంత్రి అమిత్ షా కోయంబత్తురులో పునర్విభజన ప్రక్రియపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది


అలాగే సీఎం స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. అందులోభాగంగా పలు ప్రశ్నలను సీఎం స్టాలెన్‌కు అమిత్ షా సంధించారు. మరోవైపు లోక్ సభ స్థానాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం 2024, జనవరిలో అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 08:41 PM