National Herald Case: సోనియా, రాహుల్‌కు కోర్టు నోటీసులు
ABN , Publish Date - May 02 , 2025 | 04:04 PM
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ, మే 02: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన కేసులో వీరిద్దరికీ కోర్టు ఈ నోటీసులు పంపింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుకు రిప్లై ఇవ్వాలని వారిద్దరికి కోర్టు జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్ విచారణ సమయంలో ప్రతివాదుల వాదనలు వింటామని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు.
కొత్త చట్ట నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని.. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఇటీవల దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేని కారణంగా రాహుల్, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ చర్యలు తీసుకుంది. బిజెపి నేత సుబ్రమణ్య స్వామి జూన్ 2014లో దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు స్వీకరించింది. ఆ తర్వాత ఈ కేసులో 2021లో ఈడీ దర్యాప్తు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..
Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
Canada Election 2025: ఎన్నికల్లో 22 మంది పంజాబీ ఎంపీలు ఘన విజయం
Pahalgam Terror Attack: ఎన్ఐఏ నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
Heavy Rains: న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్..విమాన సర్వీసులపై ఎఫెక్ట్
Pakistan Vs India: పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్
Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
For National News And Telugu News