Share News

Gujarat: కార్గో రోప్‌వే ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:53 PM

కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకు వెళ్తుండగా కార్గో రోప్‌వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కిందపడినట్టు చెబుతున్నారు. పవగఢ్‌లో కొండపైనున్న టెంపుల్ సైట్‌లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Gujarat: కార్గో రోప్‌వే ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
Cargo ropeway breaks down in Gujarat

అహ్మదాబాద్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని పవగఢ్ హిల్ టెంపుల్ వద్ద శక్రవారంనాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోప్‌వే కోసం నిర్మాణ సామగ్రిని తీసుకువెళ్తున్న ట్రాలీ విరిగిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు గాయపడ్డారు. మృతులలో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు, ఇద్దరు కూలీలు, మరో ఇద్దరు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకు వెళ్తుండగా కార్గో రోప్‌వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కిందపడినట్టు చెబుతున్నారు. పవగఢ్‌లో కొండపైనున్న టెంపుల్ సైట్‌లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కాగా, రోప్‌వే కోసం నిర్మాణ సామగ్రిని ట్రాలీలో తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పంచమహల్ కలెక్టర్ ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు

For More National News And Telugu News

Updated Date - Sep 06 , 2025 | 06:59 PM