Share News

UK Team Inspects Tihar: తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:01 PM

తిహాడ్‌ జైలులోని హై-సెక్యూరిటీ వార్డును సీపీఎస్ బృందం ఇటీవల పరిశీలించి ఆ వార్డులో ఉంటున్న కొందరు ఖైదీలతో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్యుజిటివ్స్‌ను వెనక్కి తీసుకువచ్చినప్పుడు వారి భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే జైలులోనే స్పెషల్ ఎన్‌క్లేప్ ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు వారికి వివరించినట్టు తెలుస్తోంది.

UK Team Inspects Tihar: తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

న్యూఢిల్లీ: బ్రిటన్‌ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) ప్రతినిధి బృందం ఇటీవల న్యూఢిల్లీలోని తిహాడ్ జైలు (Tihar Jail)ను పరిశీలించింది. ఆర్థిక, క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో యూకే అధికారులు తిహాడ్ జైలును పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీలు బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు.


కాగా, తిహాడ్‌ జైలులోని హై-సెక్యూరిటీ వార్డును సీపీఎస్ బృందం ఇటీవల పరిశీలించి ఆ వార్డులో ఉంటున్న కొందరు ఖైదీలతో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్యుజిటివ్స్‌ను వెనక్కి తీసుకువచ్చినప్పుడు వారి భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే జైలులోనే స్పెషల్ ఎన్‌క్లేప్ ఏర్పాటు స్తామని జైలు అధికారులు వారికి వివరించినట్టు తెలుస్తోంది.


దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్న వారిని అప్పగించాలని భారత్ యూకే కోర్టులను చాలాకాలంగా కోరుతోంది. అయితే ఇండియాలో జైళ్ల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రిటన్ కోర్టులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో నిందితులు కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి ఇల్లీగల్ ఇంటరాగేషన్ జరగదని భారత్ గట్టి హామీనిచ్చింది. ప్రస్తుతం దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్న 178 మంది అప్పగింతపై భారత్ అభ్యర్థనలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 యూకేలో ఉన్నాయి. వీరిలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీ తదితరులతో పాటు ఆయుధ డీలర్లు , ఖలిస్థాన్ గ్రూప్‌తో సంబంధాలున్న వ్యక్తుల పేర్లు కూడా ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టారనే ఆరోపణలను విజయ్ మాల్యా ఎదుర్కొంటుండగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.13,800 కోట్ల పంజాబ్ బ్యాంక్ ఫ్రాడ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 06 , 2025 | 06:05 PM