Investigation: ధర్మస్థలపై తొలగిన ముసుగు!
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:08 AM
ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలోని ఆ ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను పాతిపెట్టానంటూ ఫిర్యాదు చేసి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ పారిశుధ్య కార్మికుడు చన్నయ్యను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అరెస్టు చేశారు.
శవాల ఖననంపై తను చెప్పివన్నీ అబద్ధాలేనన్న మాజీ కార్మికుడు
10 రోజుల సిట్ కస్టడీ చన్నయ్య
బెంగళూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలోని ఆ ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను పాతిపెట్టానంటూ ఫిర్యాదు చేసి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ పారిశుధ్య కార్మికుడు చన్నయ్యను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. తాను చెప్పినవన్నీ అబద్ధాలేనని, తనపై కొంత మంది ఒత్తిడి చేసి ఆ విధంగా చెప్పించారని, అసలు అలాంటిదేమీ లేదని ఒప్పుకోవడంతో.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శనివారం బెళ్తంగడి కోర్టులో ప్రవేశపెట్టగా.. తదుపరి దర్యాప్తు కోసం చన్నయ్యను న్యాయాధికారి 10 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగించారు. కుట్రకు స్పష్టమైన ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు చన్నయ్య మాస్క్‌ను శనివారం తొలగించి, అరెస్టు చేసినట్లు ప్రకటించారు. చన్నయ్య చూపిన 17 ప్రదేశాల్లో సిట్ అధికారులు మృతదేహాల ఆనవాళ్ల కోసం 20 రోజులకు పైగా తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఈ నేపథ్యంలో తవ్వకాలను గతవారం నిలిపివేసిన అధికారులు.. ఆయన్ను విచారించడం ప్రారంభించారు. తాను తమిళనాడులో నివసిస్తుండగా, ఏడాదిన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన కొంత మంది తనను సంప్రదించినట్లు చన్నయ్య సిట్ విచారణలో చెప్పారు. ధర్మస్థలలో మృతదేహాలను పాతిపెట్టినట్లు ప్రచారం చేయమన్నారని, అలాంటి ఘటనలు ధర్మస్థలలో జరగలేదని తెలిపినా.. వారు వదిలిపెట్టలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ‘నెలల తరబడి తనను వెంబడించి ఒత్తిడి చేసి ఒప్పించారు. ఓ పుర్రెను తీసుకొచ్చి ఇచ్చారు. వారి సలహాలకు అనుగుణంగానే ఫిర్యాదు చేశాను’ అని చన్నయ్య సిట్ అధికారులకు వివరించాడు.
అనన్య నా కూతురు కాదు: సుజాత
మరోవైపు ధర్మస్థల వివాదంలో సుజాత భట్ ‘ముసుగు’ కూడా తొలగింది. అనన్య భట్ తన కూతురు కాదని ఆమె ఒప్పుకున్నారు. ‘నా కూతురు మంగళూరు కస్తూర్బా మెడికల్ కళాశాలలో చదువుతుండేది. స్నేహితులతోపాటు ధర్మస్థలకు వెళ్లి మాయమైంది’ అంటూ సుజాత గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుజాత భట్‌కు అసలు పిల్లలే లేరని వారం క్రితమే ఆమె బంధువులు స్పష్టం చేశారు. ఆమె చూపిన ఫొటో అనన్య భట్‌ది కాదన్నారు.
ఇవి కూడా చదవండి..
బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News