Siddaramaiah: సమానత్వం ఉంటే మతం ఎందుకు మారుతారు? వివాదం రేపిన సీఎం వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:36 PM
ప్రజల్ని మతం మారమని ఏ రాజకీయ పార్టీ కోరదని, అయినప్పటికీ మతమార్పిడులు జరుగుతున్నాయని, అది వారి హక్కు అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చన్నారు. కానీ..
బెంగళూరు: హిందువులు తమ మతాన్ని వదిలి వేరొక మతంలోకి ప్రవేశించడం (Religious conversion of Hindus)పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ కమ్యూనిటీలో సమానత్వం ఉంటే మతం మారడమనేదే ఉండదని అన్నారు. బెంగళూరులో మీడియాతో సోమవారం నాడు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'హిందూ కమ్యూనిటీలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు వేరే మతంలోకి మారతారు?' అని సీఎం ప్రశ్నించారు. ప్రజల్ని మతం మారమని ఏ రాజకీయ పార్టీ కోరదని, అయినప్పటికీ మతమార్పిడులు జరుగుతున్నాయని, అది వారి హక్కు అని అన్నారు. 'సమానత్వమే ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉంది?. అంటరానితనాన్ని మనం సృష్టించామా?. ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చు. మేము కానీ బీజేపీ కానీ ఎవర్నీ మతం మారమని కోరం. ప్రజలే మతం మారుతుంటారు. అది వారి హక్కు కూడా..' అని సిద్ధరామయ్య అన్నారు.
ముస్లింలను ప్రశ్నించగలరా?
హిందువులను టార్గెట్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కులం, మతం పేరుతో ప్రజలను విభజించేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని అసెంబ్లీలో విపక్ష నేత ఆర్.అశోక్ విమర్శించారు. అసమానత్వంపై ముస్లింలను సిద్ధరామయ్య ప్రశ్నించగలరా? అని మండిపడ్డారు.
శివాజీనగర్ మెట్రోస్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు
దీనికిముందు, బెంగళూరు శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చే ఒక ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఆమోదం తెలపడం వివాదమైంది. సెయింట్ మేరి బాసిలికా వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చగలమని ఆర్టిబిషప్ పీటర్ మచడోకు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. బుజ్జగింపు రాజకీయాల కోసం మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమాన పరుస్తోందని విమర్శించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ఈ చర్యను ఖండించారు.
ఇవి కూడా చదవండి..
అక్రమ పద్ధతులని తేలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తాం... సుప్రీం కీలక వ్యాఖ్యలు
అందుకే పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు.. సురేష్ గోపి వెల్లడి
For National News And Telugu News