Share News

CM Himanta Biswa Sarma: అసోం సీఎం మళ్లీ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 27 , 2025 | 07:39 AM

అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసాంఘిక శక్తులను ఆయన హెచ్చరించారు.

CM Himanta Biswa Sarma: అసోం సీఎం మళ్లీ సంచలన నిర్ణయం
CM Himanta Biswa Sarma

దిస్పూర్, ఆగస్టు 27: అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ మళ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధుబ్రీలో మతపరమైన అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో గతంలో విధించిన రాత్రి వేళల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను మరోసారి పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు దసరా పండగ వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ధుబ్రీలో సనాతనవాదులు అల్ప సంఖ్యాకులుగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మంగళవారం కోక్రాఝర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం శర్మ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం శర్మ మాట్లాడుతూ.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను తమ ప్రభుత్వం ఉప సంహరించ లేదన్నారు. ఆ ఆదేశాలను పోడిగిస్తున్నట్లు ప్రకటించారు. ధుబ్రీలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు ప్రస్తుతం చోటు చేసుకోవడం లేదన్నారు. అయినా ఈ ఆదేశాలను దసరా వరకు పొడిగిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది దసరా పండగ.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుపుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుందని ఆ సాంఘిక శక్తులను సీఎం శర్మ హెచ్చరించారు.


ఈ ఏడాది జూన్ మాసంలో ధుబ్రీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల అనంతరం ధుబ్రీలో సీఎం శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ధుబ్రీలో రాత్రి సమయంలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాల జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలా జారీ చేసిన ఈ ఆదేశాలను మరోసారి పొడిగించారు. అసోంలోని ధుబ్రీ జిల్లా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంది. దీంతో ఈ జిల్లాలో మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని సమాచారం మేరకు సీఎం శర్మ గతంలో ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా రైళ్లు రద్దు.. అధికారులు ఆకస్మిక నిర్ణయం

అగ్నిప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

For National News And Telugu News

Updated Date - Aug 27 , 2025 | 08:32 AM