Share News

Watch Video: బొలెరోపై బోల్తా పడిన ట్రక్కు.. షాకింగ్ వీడియో..

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:39 PM

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెక్కపొట్టు లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ప్రమాదవశాత్తు బొలెరోపై పడిపోయింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో..

Watch Video: బొలెరోపై బోల్తా పడిన ట్రక్కు.. షాకింగ్ వీడియో..
Rampur accident

లఖ్‌నవూ, డిసెంబర్ 29: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెక్కపొట్టు లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ప్రమాదవశాత్తు బొలెరోపై పడిపోయింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు తెలిపిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


రాంపూర్-నైనిటాల్ హైవేపై పహాడి గేట్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరింగింది. ఈ మార్గంలో సాధారణంగానే చాలా రద్దీ ఉంటుంది. సరిగ్గా పహాడి గేట్ సర్కిల్ సిగ్నల్ వద్దకు రాగానే బొలెరో యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, వెనకాలే వస్తున్న భారీ ట్రక్కును గమనించకుండానే బొలెరో డ్రైవర్ యూటర్న్‌కు ప్రయత్నించాడు. దాంతో ట్రక్కు డ్రైవర్ బొలెరెను ఢీకొట్టకుండా ఉండేందుకు ప్రయత్నించి సైడ్ తీసుకున్నాడు. ఈ క్రమంలో లారీ టైర్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ట్రక్కు కంట్రోల్ తప్పి నేరుగ బొలెరోపై బోల్తా పడింది. బొలెరో పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. అందులోని డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ప్రమాదానికి గురైన బొలెరో వాహనం విద్యుత్ శాఖ సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బొలెరోలో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. దీంతో డ్రైవర్ మాత్రమే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బొలెరోపై పడిన టక్కును తొలగించారు. బొలెరో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం కారణంగా రాంపూర్-నైనిటాల్ హైవేపై కొన్ని గంటలపాటు భారీ ట్రాఫిక్ అయ్యింది. అధికారులు ప్రమాదానికి గురైన ట్రక్కు, బొలెరోను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఈ ఘోర ప్రమాదం జరిగిన తీరు అంతా సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read:

Elamanchili train accident: ఎలమంచిలి ట్రైన్ యాక్సిడెంట్.. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి..

CM Chandrababu: రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..

Bold New Year Party: బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..

Updated Date - Dec 29 , 2025 | 03:39 PM